Covid Cases in India: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. సోమవారం పదివేల దిగువకు చేరుకున్న రోజువారీ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం కొత్తగా 12,249 మంది వైరస్ బారినపడగా.. మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినుంచి 9,862 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.62 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.17 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 3.94 శాతంగా ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 43,331,645
- మొత్తం మరణాలు: 5,24,903
- యాక్టివ్ కేసులు: 81,687
- కోలుకున్నవారి సంఖ్య: 4,27,25,055
Vaccination India: భారత్‌లో మంగళవారం 12,28,291 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,45,99,906 కోట్లకు చేరింది. మరో 3,10,623 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఒక్కరోజే 7,30,579 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,235 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 545,711,181 కు చేరింది. మరణాల సంఖ్య 6,343,455కు చేరింది. ఒక్కరోజే 562,676 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 52,15,68,313 గా ఉంది.
- జర్మనీలో ఒక్కరోజే 1,22,597 కొత్త కేసులు బయటపడగా..65 మంది మరణించారు.
- ఫ్రాన్స్‌లో 95,217 కొత్త కేసులు నమోదుకాగా.. 56 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో 84,120 కేసులు వెలుగుచూశాయి. 192 మందికిపైగా చనిపోయారు.
- బ్రెజిల్లో కొత్తగా 68,102 కరోనా కేసులు నమోదు కాగా.. 219 మంది మరణించారు.
- తైవాన్‌లో మరో 56,404 కేసులు.. 155 కుపైగా మరణాలు నమోదయ్యాయి.
- ఇటలీ ఒక్కరోజే 62,704 మంది కొవిడ్ బారినపడగా..62మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఆస్ట్రేలియాలో 31,569 కరోనా కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: 'అగ్నిపథ్ సైనిక నియామకాల్లో ఎలాంటి మార్పు ఉండదు'