ETV Bharat / bharat

సోనియా గాంధీకి కరోనా.. అయినా ఈడీ విచారణకు హాజరు! - rahul gandhi summons

Sonia Gandhi Corona: కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా సోకింది. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నేషనల్​ హెరాల్డ్​ కేసులో జూన్​ 8న ఆమె ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. మరోవైపు.. కరోనా నుంచి సోనియా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

Congress President Sonia Gandhi tests Covid positive ahead of ED questioning in National Herald case

author img

By

Published : Jun 2, 2022, 12:51 PM IST

Updated : Jun 2, 2022, 4:41 PM IST

Sonia Gandhi Corona: కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా బారినపడ్డారు. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా వెల్లడించారు. తేలికపాటి జ్వరం, స్వల్పలక్షణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్​లో ఉన్నారని, వైద్యం అందిస్తున్నారని స్పష్టం చేశారు. గత వారం రోజులుగా సోనియా అనేక మంది నేతలు, కార్యకర్తల్ని కలుస్తున్నారని.. వారిలో కొందరికి కొవిడ్ పాజిటివ్​గా తేలినట్లు వివరించారు. తాము ముందుగా చెప్పినట్టు.. ఈనెల 8న నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ కోసం ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్ ఎదుట ఆమె హాజరవుతారని చెప్పారు. "ఆమె త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం. ఆమెకు మళ్లీ పరీక్ష చేయిస్తాం. ఈడీ విచారణకు హాజరయ్యే ప్రణాళిక ఇప్పటికైతే యథాతథంగానే ఉంది" అని స్పష్టం చేశారు సుర్జేవాలా.

ఇదే కేసులో పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీని.. గురువారం విచారణకు హాజరుకావాలని సమన్లు పంపింది ఈడీ. అయితే.. ముందే నిర్ణయించిన షెడ్యూల్​ ప్రకారం ఇతర కార్యక్రమాలు ఉన్నందున రావడం సాధ్యం కాదని రాహుల్​.. సమాచారం పంపారు. విచారణలో పాల్గొనేందుకు మరింత సమయం కావాలని ఈడీని కోరినట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి: సోనియా, రాహుల్​కు ఈడీ సమన్లు.. కాంగ్రెస్, భాజపా మాటల యుద్ధం

అంతర్జాతీయ కాల్స్​ను లోకల్ కాల్స్​గా మార్చి.. రూ.లక్షల్లో సంపాదన.. ముఠా అరెస్ట్​!

Last Updated : Jun 2, 2022, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.