ETV Bharat / bharat

Communal Harmony In Karnataka : గుడిలో ముస్లిం ఫ్రెండ్​కు తులాభారం.. తిరుపతిలో మొక్కు తీర్చుకున్న హిందూ స్నేహితుడు

Communal Harmony In Karnataka : కర్ణాటకలో మత సామరస్యం వెళ్లివిరిసింది. తన ముస్లిం స్నేహితుడిని దేవాలయాలకు తీసుకెళ్లి మొక్కులు అప్పజెప్పాడు ఓ యువకుడు. తాను కోరుకున్నట్టుగా అతడు అనారోగ్యం నుంచి కోలుకున్నాడని.. అందుకే తీర్థ క్షేత్రాలకు తీసుకెళ్లానని చెప్పాడు.

Communal Harmony In Karnataka
Communal Harmony In Karnataka
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 11:14 AM IST

Updated : Oct 13, 2023, 11:34 AM IST

Communal Harmony In Karnataka : కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో మతసామరస్యం వెళ్లివిరిసింది. తన ముస్లిం స్నేహితుడు అనారోగ్యం నుంచి కోలుకోవాలని వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లి పూజలు చేశాడో వ్యక్తి. తన ఫ్రెండ్​ కోలుకున్న తర్వాత అతడిని తీసుకుని వెళ్లి ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి తిమ్మప్ప, కర్ణాటకలోని ధర్మస్థల మంజునాథ స్వామిని దర్శించుకుని పూజలు చేయించాడు.

అసలే జరిగిందంటే..
దావణగెరెకు చెందిన అనిస్​ పాషా లాయర్​గా పనిచేస్తున్నాడు. ఓ కేసు విషయంలో అరుణ్​ కుమార్​ అనే వ్యక్తితో అనిస్​కు​ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అరుణ్​ కుమార్​ తరఫున ఓ కేసు వాదించి గెలిచాడు అనిస్​ పాషా. అలా అనిస్​, అరుణ్​ కుమార్​ ప్రాణ స్నేహితులుగా మారారు. ఇదిలా ఉండగా.. కొవిడ్​ సమయంలో అనిస్​కు గుండె జబ్బు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అరుణ్​కుమార్​.. తన స్నేహితుడు కోలుకుంటే.. అతడితో కలిసి తిరుపతి తిమ్మప్ప దేవాలయాన్ని దర్శించుకుంటానని, ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయంలో తులాభారం సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అరుణ్​ కోరుకున్నట్టే అతడి ఫ్రెండ్ పాషాకు గుండె జబ్బు నయం అయింది. దీంతో అరుణ్​ కుమార్​ తన స్నేహితుడిని మొదటగా తిరుపతి తిమ్మప్ప దేవాలయానికి తీసుకెళ్లి పూజలు జరిపించాడు. అనంతరం కర్ణాటక.. దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయంలో బెల్లం, కొబ్బరికాయలు, బియ్యంతో తులాభారం సమర్పించాడు.

Communal Harmony In Karnataka
మొక్కులు తీర్చుకున్న అనిస్​ పాషా, అరుణ్​ కుమార్

'మీ మతాన్ని ప్రేమించు, ఇతర మతాలను గౌరవించు అని ఇస్లాం చెబుతోంది. అలాగే అనాథ పిల్లల ముందు మీ పిల్లలను కౌగిలించుకోవద్దని ప్రవక్త చెప్పారు. దాని ప్రకారం.. మా మతాలు, సంప్రదాయాలు వేరైనా.. అరుణ్​ కుమార్​ మత విశ్వాసాలు దెబ్బతినకూడదు. అందుకే నేను అతడి మొక్కులను తీర్చాను. ఇంతకుముందు ఓ కేసుకు విషయంలో అరుణ్​ నా క్లైంట్​. తర్వాత అతడు మా కుటుంబానికి సన్నిహితుడు అయ్యాడు. నేను నా న్యాయవాద వృత్తిలో చాలా మంది క్లైంట్లను కలిశాను. కానీ అరుణ్​ కుమార్​ నాకు చాలా దగ్గరయ్యాడు. 2021లో నాకు గుండె జబ్బు వచ్చింది. ఆ సమయంలో నాకు నయం కావాలని అరుణ్​ దేవుళ్లను ప్రార్థించాడు'

--అనిస్​ పాషా, అరుణ్స స్నేహితుడు

ఆంజనేయస్వామికి ముస్లింల పూజలు.. హిందువులతో కలిసి రథాన్ని లాగి...

మహాశివరాత్రి వేళ వెల్లివిరిసిన మతసామరస్యం.. భక్తులకు పండ్లు పంచిన మజ్లిస్ ఎమ్మెల్యే

Last Updated : Oct 13, 2023, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.