ETV Bharat / bharat

హనీ ట్రాప్​లో రక్షణ శాఖ మాజీ ఉద్యోగి.. కీలక సమాచారం పాకిస్థాన్​కు.. - ముజాఫర్​ లేటెస్ట్ అప్డేట్స్

ఐఎస్​ఐకు చెందిన మహిళ వలపు వలలో పడ్డాడు రక్షణ శాఖ మాజీ ఉద్యోగి. హనీ ట్రాప్​లో పడిన వ్యక్తి దేశానికి సంబంధించిన కీలక రహస్య పత్రాలను లీక్ చేశాడు.

.
.
author img

By

Published : Dec 17, 2022, 2:31 PM IST

Updated : Dec 17, 2022, 4:25 PM IST

బిహార్​లో హనీట్రాప్​ ఘటన వెలుగుచూసింది. ముజఫర్​పుర్​ జిల్లా కాట్రా రిజిస్ట్రార్ కార్యాలయంలో క్లర్క్​గా పనిచేస్తున్న రవి చౌరాసియా అనే వ్యక్తి దేశానికి సంబంధించిన రహస్య పత్రాలను పాకిస్థాన్​కు చెందిన గూఢాచారి సంస్థ ఐఎస్​ఐకు లీక్​ చేశాడనే ఆరోపణలతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. జాతీయ భద్రతా సంస్థ ఆదేశాల మేరకు క్లర్క్​ను అరెస్టు చేసినట్లు ముజఫర్​పుర్​ సీనియర్​ ఎస్​పీ జయంత్ కాంత్​ తెలిపారు. నిందితుడు.. ముంగర్​ జిల్లాకు చెందిన వ్యక్తి అని ఆయన తెలిపారు.

పాకిస్థాన్​కు చెందిన ఐఎస్​ఐ గూఢాచారి సంస్థకు పనిచేసే ఓ మహిళా ఏజెంట్​.. నిందితుడిని ఫేస్​బుక్​ ద్వారా పరిచయం చేసుకుంది. అంతకుముందు నిందితుడు చెన్నై ఆవడీలోని రక్షణ మంత్రిత్వ శాఖలో క్లర్క్​గా పనిచేసేవాడు. అక్కడి నుంచి కూడా రహస్య సమాచారాన్ని గూఢాచారులకు పంపేవాడని తేలింది. అతడి ఫోన్‌ కాల్స్ డేటా, ఈమెయిల్స్‌, వాట్సాప్‌ చాటింగ్‌లను పరిశీలించిన పోలీసులు.. నేరానికి పాల్పడినట్లుగా నిర్ధరణకు వచ్చారు. వీటి ఆధారంగా అతడిపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. నిందితుడి మొబైల్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. అతను భారత ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన సమాచారాన్ని ఐఎస్‌ఐకి పంపుతున్నట్లు గుర్తించింది సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దాని ఆధారంగానే రవిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

"ఇప్పటి వరకు విచారణలో నిందితుడి నుంచి ఎటువంటి సమాచారం వచ్చినా, దానిని భారత ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలతో పంచుకున్నాము. మున్ముందు ఎలాంటి సమాచారం వచ్చినా దర్యాప్తు సంస్థల సమన్వయం ముందుకెళ్తాము. ఈ సహకారం భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. దీనిపై పూర్తి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటాము" అని ముజఫర్‌పూర్ సీనియర్​ ఎస్పీ జయంత్ కాంత్ తెలిపారు.

Last Updated : Dec 17, 2022, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.