CISCE class 12 result: ఐఎస్సీఈ పన్నెండో తరగతి ఫలితాలను సీఐఎస్సీఈ బోర్డు విడుదల చేసింది. పరీక్ష రాసిన వారిలో 99.52 శాతం మంది విద్యార్థులు పాసైనట్లు బోర్డు వెల్లడించింది. 18 మంది విద్యార్థులు తొలి ర్యాంకు సాధించినట్లు తెలిపింది. వీరికి 99.75 శాతం మార్కులు వచ్చినట్లు బోర్డు వెల్లడించింది. ఫలితాల్లో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలదే కాస్త పైచేయి అని ప్రకటించింది. 58 మంది విద్యార్థులు రెండో ర్యాంకును పంచుకున్నారు. వీరికి 99.50 శాతం మార్కులు వచ్చాయి. 99.25 శాతం మార్కులతో 78 మంది విద్యార్థులు మూడో స్థానంలో నిలిచారు.
రెండు టర్ముల్లో ఈ బోర్డు పరీక్షలను నిర్వహించారు. మార్కుల శాతాన్ని ఎలా లెక్కించామనే విషయంపై బోర్డు కార్యదర్శి గెర్రీ అరాథూన్ వివరణ ఇచ్చారు. తొలి సెమిస్టర్లో ప్రతి సబ్జెక్టులో వచ్చిన మార్కులను సగం చేసి.. వాటిని రెండో సెమిస్టర్ మార్కులతో కలిపినట్లు తెలిపారు. తొలి సెమిస్టర్ మార్కుల్లో జామెట్రికల్, మెకానికల్ డ్రాయింగ్, ఆర్ట్ వంటి సబ్జెక్టుల మార్కులను మినహాయించినట్లు చెప్పారు. రెండో సెమిస్టర్ మార్కుల్లో ప్రాక్టికల్, ప్రాజెక్ట్ మార్కులు సైతం కలిపినట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: