ఉత్తర్‌ప్రదేశ్.. చిత్రకూట్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టమాటొల లోడ్‌తో వెళ్తున్న పికప్ ట్రక్.. అదుపు తప్పి రోడ్డు పక్కనే నిద్రిస్తున్న ఏడుగురు వ్యక్తులపై నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ఒకరు గాయపడ్డారు. క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారాన్ని ప్రకటించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: చిత్రకూట్ జిల్లా.. భరత్‌కూప్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న గ్రామస్థులపై టమాటొ లోడ్‌తో వెళ్తున్న పికప్ ట్రక్కు అదుపు తప్పి వారిపై దూసుకెళ్లింది. బాధితుల ఇల్లు.. రహదారి పక్కనే ఉందని తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపారు.
ఇవీ చదవండి:
కోడలి ముఖంపై వేడివేడి నూనె పోసిన అత్తామామ.. 6ఏళ్లైనా పిల్లలు పుట్టట్లేదని..
భద్రత వలయంలో ఉన్నా.. హత్యకు గురైన నేతలెందరో..