Chhattisgarh BJP Candidates List 2023 : ఈ ఏడాది చివరిలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలపై దృష్టిసారించిన బీజేపీ.. అభ్యర్థుల ప్రకటన ప్రక్రియ మొదలుపెట్టింది. బుధవారం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించిన తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించింది.
ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్థానాలు ఉంటే 21 మందితో తొలి జాబితాను గురువారం విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న పటాన్ స్థానంలో పార్టీ తరఫున దుర్గ్ ఎంపీ విజయ్ బఘేల్‌ను పోటీకి పెట్టింది. 2018లో జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లకు గానూ కాంగ్రెస్ 68 స్థానాలు విజయం సాధించింది. కేవలం 18 సీట్లు మాత్రమే గెలుపొందింది. ఈ సారి ఎలాగైనా ఛత్తీస్‌గఢ్‌లో విజయం సాధించాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు.
-
BJP releases the first list of 21 candidates for the upcoming Chhattisgarh Assembly Elections. pic.twitter.com/7vhoSgfbCY
— ANI (@ANI) August 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">BJP releases the first list of 21 candidates for the upcoming Chhattisgarh Assembly Elections. pic.twitter.com/7vhoSgfbCY
— ANI (@ANI) August 17, 2023BJP releases the first list of 21 candidates for the upcoming Chhattisgarh Assembly Elections. pic.twitter.com/7vhoSgfbCY
— ANI (@ANI) August 17, 2023
Madhya Pradesh BJP Candidates List 2023 : అలాగే మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 సీట్లు ఉండగా తొలి విడతలో 39 పేర్లు ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లోనూ ఐదుగురు చొప్పున మహిళలకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైన తర్వాత రోజే రెండు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది.
ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ, రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. తెలంగాణను కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పాలిస్తోంది. మధ్యప్రదేశ్‌ను బీజేపీ పాలిస్తుండగా.. మిజోరం భాగస్వామి పార్టీతో అధికారం పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
-
BJP releases the first list of 39 candidates for the upcoming Madhya Pradesh Assembly Elections. pic.twitter.com/7xdtQFxz9M
— ANI (@ANI) August 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">BJP releases the first list of 39 candidates for the upcoming Madhya Pradesh Assembly Elections. pic.twitter.com/7xdtQFxz9M
— ANI (@ANI) August 17, 2023BJP releases the first list of 39 candidates for the upcoming Madhya Pradesh Assembly Elections. pic.twitter.com/7xdtQFxz9M
— ANI (@ANI) August 17, 2023
కీలక చర్చలు.. ఫస్ట్ లిస్ట్ రిలీజ్..
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అధ్యక్షతన ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం సమావేశమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సహా పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ ఏడాది చివర్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు గురించి చర్చించారు. పార్టీ బలహీనంగా ఉన్న స్థానాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడిపోయిన సీట్లపై సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నాయి. వీటితో పాటు ఆయా రాష్ట్రాల నాయకత్వం ఇచ్చిన నివేదికలను పరిశీలించినట్లు వెల్లడించాయి.
Central Cabinet Decisions Today : వారందరికీ సబ్సిడీపై రూ.2 లక్షలు లోన్.. కేంద్రం గుడ్‌న్యూస్
బీజేపీతో పొత్తుకు అస్సలు ఛాన్సే లేదు.. అజిత్‌తో భేటీ అందుకే!: శరద్ పవార్