ETV Bharat / bharat

Chhattisgarh: దంతెవాడలో ఐఈడీ పేలుడు- ఓ వ్యక్తి మృతి - బాంబు పేలుడు

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ పెట్టిన ఐఈడీ పేలిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో 11మంది గాయపడ్డారు. బొలెరో వాహనం లక్ష్యంగా పేలుడు జరిగింది.

bomb blast
బాంబు పేలుడు
author img

By

Published : Aug 5, 2021, 11:52 AM IST

Updated : Aug 5, 2021, 12:28 PM IST

దంతెవాడలో ఐఈడీ పేలుడు

ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లాలో నక్సల్స్‌ పెట్టిన ఐఈడీ పేలి.. ఓ వ్యక్తి మరణించాడు. మరో 11 మంది గాయపడ్డారు. మాలేవాది పోలీస్‌ స్టేషన్ పరిధిలో.. ఘోతియా గ్రామానికి సమీపంలో ఈ పేలుడు సంభవించింది. నారాయణ్‌పుర్‌ నుంచి దంతెవాడను కలిపే మార్గంలో వెళ్తున్న బొలెరో లక్ష్యంగా గురువారం ఉదయం 7.30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

bomb blast
పేలుడుకు గురైన వాహనం
bomb blast
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న సిబ్బంది
bomb blast
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు

క్షతగాత్రుల్ని దంతెవాడ జిల్లా ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించినట్లు తెలిపారు. భద్రతాబలగాలు అనుకుని పొరపాటున బొలేరో వాహనాన్ని మావోయిస్టులు పేల్చి ఉంటారని.. అనుమానిస్తున్నారు. అయితే దంతెవాడలో పోలీసు బలగాలు ఎప్పుడూ నాలుగు చక్రాల వాహనాలు ఉపయోగించవని ఎస్పీ అభిషేక్‌ పల్లవా వెల్లడించారు.

ఇదీ చూడండి: Covid updates: దేశంలో మరో 42,982 మందికి కరోనా

Last Updated : Aug 5, 2021, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.