ETV Bharat / bharat

సొంతకాళ్లపై నిలబడుతున్న ట్రాన్స్​జెండర్లు.. స్పెషల్​గా హోటల్ పెట్టి.. - transgender hotel tamil nadu

ట్రాన్స్​జెండర్లంటే చాలా మంది చూపు తిప్పేసుకుంటారు.. సమాజంలో వారికి సరైన గౌరవం దక్కడం కూడా అరుదు. ఈ వైఖరిని మార్చేస్తున్నారు తమిళనాడుకు చెందిన ట్రాన్స్​జెండర్స్. స్వతహాగా తమకాళ్లపై నిలబడుతున్నారు.

Chennai Trans Kitchen
Chennai Trans Kitchen
author img

By

Published : Jan 22, 2023, 8:35 PM IST

Updated : Jan 22, 2023, 10:22 PM IST

చెన్నై ట్రాన్స్ కిచెన్

ప్రతి దుకాణానికి వెళ్లి యాచించడమే వారి వృత్తి అనుకునేవారికి సరైన జవాబు ఇస్తున్నారు చెన్నైకి చెందిన ట్రాన్స్​జెండర్లు. ఒకరి వద్ద పనిచేయడమే కాదు... సొంతంగా నలుగురికి పని ఇవ్వగలమని నమ్మి.. 'చెన్నై ట్రాన్స్ కిచెన్' అనే హోటల్​ను ఏర్పాటు చేశారు. యునైటెడ్ వే చెన్నై అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో.. ట్రాన్స్​పర్సన్స్ రైట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక డైరెక్టర్ అయిన జీవా ఈ హోటల్​ను ఏర్పాటు చేశారు. చెన్నై... కోలాతూర్​లోని జీకేఎం కాలనీ, 25వ వీధిలో ఈ హోటల్ ఉంది. ఉదయం టిఫిన్లతో పాటు, మధ్యాహ్నం, సాయంత్రం వెజ్, నాన్​వెజ్ వంటకాలను సర్వ్ చేస్తున్నారు. చేపల కూర, ఇడ్లీ కలిపి ఇచ్చే మీన్ కులంబు వంటకం ఇక్కడ ఫేమస్.

Chennai Trans Kitchen
ట్రాన్స్ కిచెన్

మొత్తం పది మంది ట్రాన్స్​జెండర్లను హోటల్​లో పనిచేసేందుకు నియమించుకున్నారు. ట్రాన్స్​జెండర్లను బయట ఎవరూ ఉద్యోగంలోకి తీసుకోవడం లేదని.. అందుకే సొంతంగా హోటల్ ఏర్పాటు చేసినట్లు ట్రాన్స్ కిచెన్ యజమాని జీవా చెబుతున్నారు. ట్రాన్స్​జెండర్లలో కొంతమందికైనా సొంత కాళ్లపై నిలబడే అవకాశాలు వస్తాయన్న ఉద్దేశంతో ఈ హోటల్​ను పెట్టినట్లు జీవా చెప్పారు.

Chennai Trans Kitchen
ట్రాన్స్​కిచెన్ ఓపెనింగ్..

"ఇదివరకు ట్రాన్స్​జెండర్ తమ కుటుంబంలో ఉన్నారని తెలిస్తే వారిని బయటకు పంపించేవారు. వీరికి సరైన విద్య అందదు. ఉద్యోగ అవకాశాలు అసాధ్యం. ఒకవేళ చదువుకున్నవారు ఉన్నప్పటికీ వారిని ఉద్యోగాల్లో చేర్చుకునేవారు ఉండరు. కానీ పరిస్థితులు మారుతున్నాయి. కోయంబత్తూర్​, మధురైలలో ఇప్పటికే ట్రాన్స్ కిచెన్​లను ఏర్పాటు చేశాం. ట్రాన్స్​జెండర్లంటే సెక్స్ వర్క్ మాత్రమే కాదని చెప్పేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నాం. ట్రాన్స్​జెండర్లలో వంట బాగా చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. తొలుత 60 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చాం. అందులో 20 మందిని షార్ట్ లిస్ట్ చేసి.. చివరకు 10 మందిని నియమించుకున్నాం. ఇందులో ఐదుగురు ట్రాన్స్​మెన్, ఐదుగురు ట్రాన్స్​ఉమన్ ఉన్నారు. సైదాపేట్​లో వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాం."
-జీవా, ట్రాన్స్ ఉమన్

జీవా ప్రారంభించిన హోటల్​లో తామరసెల్వి సైతం పనిచేస్తున్నారు. గతంలో దుకాణాలకు వెళ్లి యాచిస్తూ జీవించిన తామరసెల్వి.. ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో బతుకుతున్నట్లు చెప్పారు.

Chennai Trans Kitchen
ట్రాన్స్ కిచెన్

"గతంలో దుకాణాల వద్దకు వెళ్లి డబ్బులు సంపాదించేదాన్ని. అప్పుడు బాగానే బతికేవాళ్లం. కానీ బయట అందరూ మన ముందు ఒకలా.. మనం లేనప్పుడు ఒకలా ప్రవర్తించేవారు. ఈ రెస్టారెంట్ వల్ల మంచిగా పనిచేసుకుంటున్నాం. ప్రస్తుతానికి డబ్బు బాగానే వస్తోంది. ఇలాగే పనిచేస్తూ ఉంటే సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది."
-తామరసెల్వి, వంటలు చేసే వ్యక్తి

ట్రాన్స్​జెండర్లలో చాలా మంది మంచి వంటగాళ్లు ఉన్నారని.. తమ నైపుణ్యాలను ఉపయోగించుకునే వారికోసం వారు ఎదురుచూస్తున్నారని జీవా చెబుతున్నారు. అలాంటి వారి నైపుణ్యాలను ప్రజలకు పరిచయం చేస్తామని అంటున్నారు. సమాజంలో సమాన హోదా వీరు చేస్తున్న ప్రయత్నానికి స్థానికులు సలాం కొడుతున్నారు.

Last Updated : Jan 22, 2023, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.