ETV Bharat / bharat

Chandrababu Interim Bail in Skill Development Case: స్కిల్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ - TDP Leaders Happy about Chandrababu Bail

Interim_bail_for_Chandrababu_in_skill_development_case

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 10:40 AM IST

Updated : Oct 31, 2023, 2:30 PM IST

10:37 October 31

నాలుగు వారాలపాటు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌

Chandrababu Interim Bail in Skill Development Case: స్కిల్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌

Chandrababu Interim Bail in Skill Development Case: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. 4 వారాల పాటు ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది. ఈ మేరకు నేడు న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్‌ వేశారు.

Chandrababu Interim Bail Conditions: చంద్రబాబుకు హైకోర్టు షరతులతో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున పూచీకత్తు, ఇద్దరు షూరిటీలు సమర్పించాలని పేర్కింది. తనకు నచ్చిన ఆస్పత్రిలో సొంత ఖర్చులతో చికిత్స పొందాలన్న హైకోర్టు.. చికిత్స, ఆస్పత్రి వివరాలు జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించాలని ఆదేశించింది. ఈ వివరాలను సరెండర్‌ అయ్యే సమయంలో సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని సూచిందింది. అదే విధంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసును ప్రభావితం చేయరాదని.. నవంబర్‌ 28 సాయంత్రం 5లోగా రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌ వద్ద సరెండర్‌ కావాలని తెలిపింది.

కోర్టుకు షూరిటీలు సమర్పించిన టీడీపీ నేతలు: టీడీపీ నేతలు దేవినేని ఉమ, బొండా ఉమ కోర్టుకు షూరిటీలు సమర్పించారు. రూ.లక్ష పూచీకత్తు చొప్పున టీడీపీ నేతలు సమర్పించారు. అదే విధంగా బెయిల్ ఆర్డర్‌, అఫిడవిట్లను ఏసీబీ కోర్టుకు చంద్రబాబు తరఫు లాయర్లు సమర్పించారు. తదుపరి ఆదేశాలను జైలు అధికారులకు మెయిల్ ద్వారా పంపుతామన్న ఏసీబీ కోర్టు తెలిపింది.

ఆరోగ్య సమస్యలకు చికిత్స నిరాకరించడం సాధ్యం కాదు: చంద్రబాబు వ్యక్తిగత వైద్యులు, ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన ఆరోగ్య పరీక్షల నివేదికల్లో పెద్దగా వ్యత్యాసాలు లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. స్కిల్ కేసులో సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌పై నిర్ణయం వచ్చేవరకు మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. విచారణలో ఉన్నప్పుడు నేరారోపణలు ఎంత తీవ్రమైనవైనా.. వ్యక్తి ఆరోగ్య సమస్యలకు చికిత్స నిరాకరించడం సాధ్యం కాదని పేర్కొంది. అభియోగం ఎదుర్కొంటూ జైలులో ఉన్న వ్యక్తికి సమగ్రమైన వైద్య చికిత్స తీసుకునే హక్కు ఉంటుందని విశ్వసిస్తున్నామని అభిప్రాయపడింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు తగిన వైద్యం పొందేందుకు అవకాశం ఇవ్వాలన్న విషయాన్ని పేర్కొంది.

Cyber Towers Silver Jubilee Celebrations: చంద్రబాబు నినాదాలతో మార్మోగిన గచ్చిబౌలి స్టేడియం.. సీబీఎన్ గ్రాటిట్యూట్ కార్యక్రమానికి విశేష స్పందన

మానవతా దృక్పథంతో మధ్యంతర బెయిల్: మధ్యంతర బెయిల్‌ కేవలం ప్రాణాపాయంలాంటి పరిస్థితులు ఉన్నప్పుడే మంజూరు చేయాలన్న అంశానికి పరిమితం కాలేమన్న హైకోర్టు.. ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు విచక్షణతో బెయిల్‌ ఇవ్వొచ్చని తెలిపింది. పిటిషనర్‌ ఆరోగ్య సమస్యలకు తక్షణ చికిత్స అందాలన్న అంశంలో ఎలాంటి వివాదం లేదన్న హైకోర్టు.. కుడి కంటికి శస్త్రచికిత్స ప్రధానమైందని.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి.. న్యాయప్రక్రియ నుంచి తప్పించుకునే వ్యక్తి కాదని హైకోర్టు అభిప్రాయపడింది. సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తి.. సమాజంతో బలమైన సంబంధ బాంధవ్యాలు కలిగినవారిగా భావిస్తున్నట్టు పేర్కొంది. వైద్యం ఎక్కడన్నది పిటిషనర్‌ ఇష్టానికే వదిలేస్తున్నామని.. పిటిషనర్‌ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కేసు వివరాల్లోకి వెళ్లకుండా మానవతా దృక్పథంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నామని హైకోర్టు వెల్లడించింది.

నవంబర్‌ 10వ తేదీన రెగ్యులర్‌ బెయిల్‌పై విచారణ: చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించగా.. మరో సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని.. కంటికి ఆపరేషన్‌ చేయాలని వైద్యులు సూచించారని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. నవంబర్‌ 10వ తేదీన రెగ్యులర్‌ బెయిల్‌పై హైకోర్టు విచారణ జరగనుంది.

సెప్టెంబర్‌ 9న నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అరెస్ట్‌ చేసింది. అనంతరం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం ఆయనికి రిమాండ్‌ విధించింది. దీంతో చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. 52 రోజులుగా చంద్రబాబు జైలులో ఉన్నారు. తాజాగా చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో.. ఆయన సాయంత్రం విడుదలయ్యే అవకాశముంది.

TDP Kallu Teripiddam Program: జగనాసురుడి..'కళ్లు తెరిపిద్దాం' కార్యక్రమానికి విశేష స్పందన.. గంతలు కట్టుకుని నిరసన..

TDP Leaders Celebrations for Chandrababu Interim Bail: మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో.. రాజమండ్రి జైలు నుంచి భారీ ర్యాలీతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అమరావతి రానున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ప్రతి జిల్లా నుంచి తెలుగుదేశం నేతలు రాజమహేంద్రవరం బయలుదేరుతున్నారు. ఈ సాయంత్రమే చంద్రబాబు బయటకు వస్తారని తెలుగుదేశం నేతల అంచనా వేస్తున్నారు. రాజమండ్రి పాత హైవే నుంచి వేమగిరి, రావులపాలెం, పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం చంద్రబాబు విజయవాడ రానున్నారు. అమరావతి చేరుకున్నాక.. అక్కడ నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తారు. అనంతరం హైదరాబాద్‌ వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.

TDP Leaders Happy about Chandrababu Interim Bail: తమ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంపై టీడీపీ శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం లోకేశ్, బ్రాహ్మణి చేరుకున్నారు. రాజమహేంద్రవరం టీడీపీ కార్యాలయానికి లోకేశ్ వెళ్లారు.

ఏ తప్పూ చేయని అధినేతను 52 రోజులుగా అక్రమంగా జైల్లో బంధించారని తెలుగుదేశం రాష్ర్ట అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. స్కిల్‌ కేసులో చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడాన్ని స్వాగతించారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంపై అచ్చెన్న భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే వైసీపీ సమాధి కావడం ఖాయమన్నారు.

Nara Lokesh Press Meet at Rajahmundry Central Jail: వ్యవస్థలను మేనేజ్‌ చేయడం వల్లే 50 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారు: లోకేశ్

Last Updated : Oct 31, 2023, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.