ETV Bharat / bharat

ఏఐజీ ఆస్పత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జి - కుడి కంటికి ఆపరేషన్ అవసరమన్న నేత్ర వైద్యులు

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2023, 3:46 PM IST

Chandrababu Discharged From AIG Hospital: వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిశ్చార్జ్‌ అయ్యారు. చంద్రబాబు డిశ్చార్జ్‌ సందర్భంగా ఆస్పత్రి వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. ఏఐజీ నుంచి బయలుదేరిన చంద్రబాబు జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వెళ్లనున్నారు. చంద్రబాబు వెంట నారా భువనేశ్వరి బయల్దేరారు.

Chandrababu_Discharged_From_AIG_Hospital

Chandrababu Discharged From AIG Hospital: వైద్య పరీక్షల కోసం ఏఐజీ ఆస్పత్రిలో చేరిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిశ్చార్జి అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రి వైద్యులు ఆయన్ను డిశ్చార్జి చేశారు. చంద్రబాబు నాయుడు వెంట ఆయన సతీమణి నారా భువనేశ్వరి బయల్దేరారు. ఏఐజీ (Asian Institute of Gastroenterology) నుంచి బయలుదేరిన చంద్రబాబు జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వెళ్లనున్నారు.

వైద్య పరీక్షల కోసం చంద్రబాబు గురువారం ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఏఐజీకి చెందిన గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు డాక్టర్‌ కె.రాజేష్‌ ఆధ్వర్యంలో జనరల్‌ మెడిసిన్‌తోపాటు కార్డియాలజీ, డెర్మటాలజీ, పల్మనాలజీ విభాగాలకు చెందిన వైద్య నిపుణుల బృందం చంద్రబాబుకు వివిధ వైద్య పరీక్షలు సూచించినట్లు సమాచారం. రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ, 2డీ ఎకో, అలర్జీ స్క్రీనింగ్‌, కాలేయ, మూత్రపిండాల పనితీరు, ఇతర టెస్టులు చేసినట్లు తెలుస్తోంది.

ఏఐజీ ఆస్పత్రిలో అడ్మిట్​ అయిన చంద్రబాబు, ఒకరోజు ఉండే అవకాశం

చంద్రబాబు జైలులో తీవ్ర అలర్జీ, అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో స్కిల్​ కేసులో మధ్యంతర బెయిల్‌ లభించడంతో చంద్రబాబు బుధవారం హైదరాబాద్‌ చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో ఏఐజీ గురువారం ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఒకరోజు అక్కడే ఉన్న చంద్రబాబుకు వైద్యులు వివిధ పరీక్షలు చేశారు.

రాజమండ్రి జైలులో చంద్రబాబు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. గతంలో చంద్రబాబు కంటికి వైద్యం చేసిన హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌కు చెందిన వైద్య నిపుణులు.. చంద్రబాబుకు ఉన్న కంటి సమస్యలు, చేయాల్సిన చికిత్స, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఓ నివేదికలో వివరించారు. కంటిలో శుక్లాలు ఏర్పడ్డాయని.. ఎడమ, కుడి కంటి చూపుల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉన్నందున 3 నెలల్లో కుడి కంటికి సర్జరీ చేయాలని సూచించారు. అదే విధంగా జైలులో చర్మసంబంధ సమస్యలు చంద్రబాబును తీవ్రంగా బాధించాయి.

చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ - అదనపు షరతుల అంశంపై హైకోర్టు తీర్పు

చంద్రబాబుకు హైకోర్టు షరతులతో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. వ్యక్తి ఆరోగ్య సమస్యలకు చికిత్స నిరాకరించడం సాధ్యం కాదని.. అభియోగం ఎదుర్కొంటూ జైలులో ఉన్న వ్యక్తికి సమగ్రమైన వైద్య చికిత్స తీసుకునే హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు తగిన వైద్యం పొందేందుకు అవకాశం ఇవ్వాలని చెప్తూ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రెగ్యులర్ బెయిల్​పై నవంబరు 10న కోర్టు విచారణ జరపనుంది.

Chandrababu Interim Bail Conditions: చంద్రబాబుకు కోర్టు పలు షరతులు విధించింది. స్కిల్‌ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దని, ర్యాలీల్లో పాల్గొనవద్దని పేర్కొంది. అయితే తాజాగా సీఐడీ చేసిన అదనపు షరతులను కోర్టు తోసిపుచ్చింది. చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను తిరస్కరించింది.

Chandrababu Interim Bail in Skill Development Case: స్కిల్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.