ETV Bharat / bharat

త్వరలో 'పీఎం శ్రీ స్కూల్స్'​.. కొత్త పాఠశాలలు ప్రారంభిస్తున్న కేంద్రం - పీఎం శ్రీ స్కూల్స్

PM Shri schools: భవిష్యత్తుకు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'పీఎం శ్రీ స్కూల్స్​'ను ప్రారంభించనుంది. నూతన విద్యావిధానంపై గుజరాత్​లో జరిగిన సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయం వెల్లడించారు.

pm shri schools
pm shri schools
author img

By

Published : Jun 2, 2022, 7:32 PM IST

PM Shri schools: నూతన విద్యా విధానం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తుకు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలనే లక్ష్యంతో 'పీఎం శ్రీ స్కూల్స్​'ను ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ గురువారం ప్రకటించారు. నూతన విద్యావిధానంపై గుజరాత్​లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ పాఠశాలలను నూతన విద్యావిధానానికి ప్రయోగశాలగా అభివర్ణించారు.

"భారత్​ను ప్రతిభగల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి వచ్చే 25 సంవత్సరాలు కీలకమైనవి. మనమందరం కలిసి పనిచేద్దాం. మన అనుభవాలను పంచుకుని దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలా కృషి చేద్దాం. పాఠశాల విద్య అనేది విద్యార్థికి పునాది. అత్యాధునిక సదుపాయాలతో ​పీఎం స్కూల్స్​ను స్థాపిస్తాం. 21 శతాబ్దంలోని నైపుణ్యాలను విద్యార్థులకు అందిస్తాం."

--ధర్మేంద్ర ప్రధాన్​, కేంద్ర విద్యాశాఖ మంత్రి

ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ వేడుకలు జరుపుకుంటున్న ఈ తరుణంలో నేషనల్​ అచీవ్​మెంట్​ సర్వే 2021 తమలో విశ్వాసాన్ని నింపిందన్నారు ప్రధాన్​. విద్యా రంగంలోని లోపాలు సరిదిద్దుకుని.. వ్యవస్థను పటిష్ఠ పరిచి నాణ్యమైన విద్య అందించడానికి రాష్ట్రాలు కృషి చేస్తున్నాయని ఈ సర్వే స్పష్టం చేసిందని గుర్తుచేశారు. విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్​ విద్యను అందించేలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు భాగస్వామ్యం తీసుకోవాలని ఆయన​ కోరారు. దేశ యువత విశ్వ పౌరులుగా మారడానికి విద్య ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 2001 లో మాజీ ప్రధానమంత్రి అటల్​ బిహారీ వాజ్​పేయి ప్రారంభించిన సర్వ శిక్షా అభియాన్​ విద్యా రంగంలో అనేక మార్పులు తీసకువచ్చిందని చెప్పారు. నూతన విద్యా విధానం మాతృభాషలో నేర్చుకోవడానికి, నైపుణ్యాభివృద్ధికి నూతన విద్యా విధానం ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు ప్రధాన్.

NEP 2020 implementation: నూతన విద్యా విధానంలో.. పాఠశాల విద్యావ్యవస్థ ఆరు విభాగాలుగా మారింది. పూర్వ ప్రాథమిక విద్య 1, 2 శాటిలైట్ ఫౌండేషన్ బడులుగా మారాయి. ప్రీ ప్రైమరీ 1,2 సహా ఒకటి, రెండు తరగతులు ఉంటే ఫౌండేషన్, 1 నుంచి 5 తరగతులు ఉంటే ఫౌండేషన్ ప్లస్​గా మార్పు చెందాయి. 3 నుంచి 8వ తరగతి వరకు ఉంటే ప్రీ హైస్కూళ్లు, 3 నుంచి 10వ తరగతి వరకు ఉంటే ఉన్నత పాఠశాలలు, 3 నుంచి 12 వరకు ఉంటే హైస్కూల్ ప్లస్​గా మారాయి.

ఇదీ చదవండి: యూపీఎస్సీ వైస్ ప్రిన్సిపల్, లెక్చరర్ ఉద్యోగాలు.. ఆ ఏజ్ వారికీ ఛాన్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.