Covid-19 treatment guidelines: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు వేల మందికి వైరస్ సోకుతున్న క్రమంలో కరోనా రోగుల చికత్స మార్గదర్శకాలను సవరించింది కేంద్రం. అత్యవసర వినియోగం కింద రెమ్‌డెసివిర్, టోసిలిజుమాబ్ వినియోగించేందుకు అనుమతించింది. అయితే, అన్ని ప్రమాణాలు చేరుకున్నప్పుడే వినియోగించాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. తీవ్ర లక్షణాలతో 10 రోజులకుపైగా బాధపడుతున్న కొవిడ్ రోగులకు రెమ్‌డెసివర్ వినియోగించాలని సూచించింది.
-
COVID-19 National Task Force under Ministry of Health and Family Welfare releases revised clinical guidance for the management of adult COVID-19 patients pic.twitter.com/x4R6ZntVnz
— ANI (@ANI) January 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">COVID-19 National Task Force under Ministry of Health and Family Welfare releases revised clinical guidance for the management of adult COVID-19 patients pic.twitter.com/x4R6ZntVnz
— ANI (@ANI) January 17, 2022COVID-19 National Task Force under Ministry of Health and Family Welfare releases revised clinical guidance for the management of adult COVID-19 patients pic.twitter.com/x4R6ZntVnz
— ANI (@ANI) January 17, 2022
" కరోనాతో ఆసుపత్రిలో చేరిన రోగులకు ఐదు రోజుల పాటు రెమ్‌డెసివిర్ వినియోగించాలి. అయితే, ఆక్సిజన్ సపోర్ట్ లేదా ఇన్‌హోమ్ సెట్టింగ్‌లో లేని వారికి ఉపయోగించకూడదు. అలాగే.. కొవిడ్ బారిన పడి ఆక్సిజన్ సపోర్ట్ లేదా ఐవీఎం అవసరమైన, స్టెరాయిడ్స్‌కు స్పందించని వారికి మాత్రమే టోసిలిజుమాబ్‌ను సూచించాలి. తీవ్రంగా ప్రభావితమై ఐసీయూలో చేరాల్సి వచ్చిన వారికి 24-48 గంటల్లోపు వినియోగిస్తే మేలు. టీబీ, ఫంగల్, సిస్టెమిక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేని వారికి మాత్రమే ఈ మాత్రలు ఇవ్వాలి. "
- కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.
60 ఏళ్లకుపైబడి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయ వ్యాధుల వంటి వాటితో బాధపడుతున్న వారిని హైరిస్క్ కేటగిరీలోకి తీసుకోవాలని పేర్కొంది.
ఈ క్రమంలో కొవిడ్-19 చికిత్స జాబితాలో హెపారిన్ లేకపోవటాన్ని తప్పుపట్టారు ఆసియన్ సోసైటీ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ అధ్యక్షులు డాక్టర్ టమోరిష్ కోలే. దాన్ని తప్పనిసరిగా చికిత్స చార్ట్‌లో చేర్చాలన్నారు. అవసరమైన అన్ని ప్రమాణాలను చేరుకున్నప్పుడే రెమ్డిసివిర్, టోసిలిజుమాబ్‌ను ఉపయోగించాలన్నారు.
ఇదీ చూడండి: మహారాష్ట్ర, కర్ణాటకలో తగ్గిన కరోనా కేసులు.. కేరళలో భారీగా..