ETV Bharat / bharat

కొలీజియం సిఫార్సులు వెనక్కి.. 20 దస్త్రాలను తిప్పి పంపిన కేంద్రం! - సుప్రీంకోర్టు కేంద్రం కొలీజియం

కొలీజియం పంపిన 20 దస్త్రాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపింది. సిఫార్సుల ఆమోదం విషయంలో కేంద్రం తాత్సారం చేస్తోందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది.

SC COLLEGIUM
SC COLLEGIUM
author img

By

Published : Nov 29, 2022, 7:51 AM IST

కొలీజియం సిఫార్సుల ఆమోదంలో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తంచేసిన రోజే కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం పంపిన 20 దస్త్రాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపింది. కొలీజియం సిఫారసు చేసిన పేర్లపై కేంద్రం బలమైన అభ్యంతరాలు లేవనెత్తిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తిప్పిపంపిన 20 దస్త్రాల్లో 11 కొత్త సిఫార్సులని వెల్లడించాయి. మిగిలిన 9 కొలీజియం గతంలోనే సిఫారసు చేసి.... పునఃపరిశీలనకు పంపినవని తెలియజేశాయి.

తాను స్వలింగ సంపర్కుడినంటూ బహిరంగంగా ప్రకటించిన సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్పాల్ పేరు కూడా తిప్పిపంపినవాటిలో ఉన్నట్లు సమాచారం. కిర్పాల్ భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఎన్. కిర్చాల్ కుమారుడు. కిర్పాల్‌ను హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని దిల్లీ హైకోర్టు 2017 అక్టోబరులోనే ప్రతిపాదించింది. అయితే, సుప్రీంకోర్టు కొలీజియం ఆయన నియామకం విషయంలో మూడుసార్లు సంప్రదింపులను వాయిదా వేసింది. ఎట్టకేలకు 2021 నవంబరులో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృతంలోని కొలీజియం.. కిర్పాల్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఆయన్ను దిల్లీ హైకోర్టు జడ్జిగా నియమించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.