ETV Bharat / bharat

పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరిమితం... తేల్చిచెప్పిన కేంద్రం - జలసంఘం ఛైర్మన్‌ కుష్వీందర్‌ ఓరా

Clarification On Polavaram Water level : పోలవరంపై పార్లమెంటులో కేంద్రం కీలక విషయాన్ని వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితమని తేల్చి చెప్పింది. ఆయా వివరాలను కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ వెల్లడించారు. తొలిదశ సహాయం, పునరావాసం మార్చి 2023కే పూర్తికావాల్సి ఉందన్న కేంద్రం.. ఇప్పటి వరకు 11,677 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించినట్లు తెలిపింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 23, 2023, 3:45 PM IST

Clarification On Polavaram Water level : పోలవరంపై పార్లమెంటులో కేంద్రం కీలక విషయాన్ని వెల్లడించింది. రిజర్వాయర్ లో నీటినిల్వ సామర్థ్యంపై జల్‌శక్తి శాఖ లోక్‌సభలో సమాధానమిచ్చింది. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితమని తేల్చిన కేంద్రం... తొలిదశలో ఆ మేరకే నిల్వ చేయనున్నట్లు వెల్లడించింది. తొలిదశ సహాయ, పునరావాసం కూడా అంతవరకేనని కేంద్రం స్పష్టంగా చెప్పింది. తొలిదశ సహాయ, పునరావాసం మార్చి 2023కే పూర్తికావాల్సి ఉందన్న కేంద్రం.. 20,946 నిర్వాసిత కుటుంబాలకు సహాయం, పునరావాసం ఖరారైనట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 11,677 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించినట్లు తెలిపింది. సహాయం, పునరావాసం మార్చికే పూర్తికావాల్సి ఉన్నా జాప్యం జరిగిందని వైఎస్సార్సీపీ ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఆయా వివరాలను కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ వెల్లడించారు.

ముంపుపై స్పష్టత... అంతకు ముందు... ఈ ఏడాది జనవరి 25న పోలవరం సాంకేతిక అంశాలపై భాగస్వామ్య రాష్ట్రాలతో దిల్లీలో జరిగిన సమావేశంలో ముంపు ముప్పు లేదని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ముంపు ముప్పంటూ.. తెలంగాణ సహా అభ్యంతరాలు లేవెనత్తిన ఎగువ రాష్ట్రాల అనుమానాలు నివృత్తి చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది. ఆయా రాష్ట్రాల అభ్యంతరాలు తోసిపుచ్చిన జలసంఘం.. ఇప్పటికే అధ్యయనం పూర్తైందని, మరోసారి అధ్యయనం చేసే అవకాశమే లేదని తేల్చిచెప్పింది.

జలసంఘం ఛైర్మన్‌ కుష్వీందర్‌ ఓరా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, ఒడిశా నీటిపారుదల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి, నాగేంద్రరావు, అశుతోష్‌ తదితరులు హాజరయ్యారు. గోదావరి నదికి ఇప్పటి వరకు గరిష్ఠంగా 36 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చిందని.., 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలను అంచనా వేసి ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామని సీడబ్ల్యూసీ ఛైర్మన్‌ కుష్వీందర్‌ ఓరా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. 2022 జూలై, ఆగస్టు నెలల్లో గోదావరికి వచ్చిన వరద వల్ల భద్రాచలం, మణుగూరు, బూర్గంపాడు సహా మరో ఆరు గ్రామాలు 891 ఎకరాలు ముంపులో చిక్కుకున్నాయన్న తెలంగాణ వాదనను జలసంఘం తోసిపుచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపు ఆ స్థాయిలో ఉండబోదని చెప్తూ.. స్థానిక భౌగోళిక పరిస్థితుల వల్ల అలాంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చని విశ్లేషించింది. ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి సైతం.. తెలంగాణ వాదిస్తున్నట్లుగా ఆ ప్రాంతాలేవీ ముంపులో ఉండబోవని స్పష్టం చేశారు. పోలవరం పూర్తిస్థాయి నీటిమట్టాన్ని సూచిస్తూ.. ఇప్పటికే సర్వేరాళ్లు ఏర్పాటు చేశామని వివరించారు. తెలంగాణ అధికారులు వస్తే వాటిని చూపిస్తామని... ముంపు ప్రాంతాలకు పునరావాసం కింద నిధులిచ్చి వాటిని తీసుకుంటామని వెల్లడించారు.

ఇవీ చదవండి :

  • రాహుల్​ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష.. ఆరేళ్లు అనర్హత వేటు ఖాయమా?
  • దేశవ్యాప్తంగా కోట్ల మంది డేటా చోరీ.. ముఠా గుట్టురట్టు చేసిన సైబరాబాద్​ పోలీసులు
  • 140 రోజుల తర్వాత అత్యధిక కొవిడ్ కేసులు.. ఇక జాగ్రత్త పడాల్సిందేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.