ETV Bharat / bharat

CBN Quash Petition Arguments in Supreme Court: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై.. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు - CBN Cash Petition Arguments news

CBN Quash Petition Arguments in Supreme Court: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలని కోరుతూ.. చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించగా.. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.

CBN Quash Petition Arguments in Supreme Court

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 6:09 PM IST

CBN Quash Petition Arguments in Supreme Court: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలని కోరుతూ.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)లో వేసిన క్వాష్‌ (స్పెషల్ లీవ్) పిటిషన్‌పై జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణలో భాగంగా చంద్రబాబు తరుఫున న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు వినిపించగా, సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరువైపులా న్యాయవాదుల వాదోపవాదాలను పరిగణలోనికి తీసుకున్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది.

CID Advocate Mukul Rohatgi Arguments: సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ..''ఈ కేసులో 17ఏ సెక్షన్‌ వర్తించదు. పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్‌ వర్తించదు. 17ఏ సెక్షన్‌ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది. 17ఏ సెక్షన్‌ అవినీతిపరులకు రక్షణ ఛత్రం కాకూడదు. ప్రజాప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఇబ్బందిపడకూడదనే ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే. అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినప్పుడు ఐపీసీ సెక్షన్ల ప్రకారం కూడా విచారించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉంటుంది. అవినీతి కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. అవినీతి నిరోధం కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి.. అందుకే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. న్యాయపరిధికి సంబంధించి వివాదం లేదు.. ప్రత్యేక కోర్టుకు సంపూర్ణ న్యాయపరిధి ఉంది. వందల కోట్లు అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నప్పుడు సెక్షన్‌ 482 సీఆర్‌పీసీ కింద క్వాష్‌ చేయలేము'' అని వాదనలు వినిపించారు.

Chandrababu Skill Development Case: 'స్కిల్ కేసు'లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ.. ఈ నెల 19కి వాయిదా వేసిన హైకోర్టు

Supreme Court on Mukul Rohatgi Arguments: ఈ నేపథ్యంలో జస్టిస్‌ త్రివేది, జస్టిస్‌ అనిరుద్ధబోస్‌లు ముకుల్‌ రోహత్గీ వాదనలపై స్పందిస్తూ.. 'ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్ష కూడా వేయవచ్చు, ఆరోపణలపైనే అన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతామా..? అవినీతి కేసుల కిందకు వస్తుందంటే పరిగణించండి.. లేదంటే క్వాష్‌ చేయండి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది.. 17ఏ వర్తిస్తుందా.. లేదా అనేదే కదా..? కేసుల నమోదు, ఛార్జిషీట్‌, విచారణ అన్ని కేసుల్లోనూ జరిగేదే' అని పేర్కొన్నారు.

Mukul Rohatgi on GST, Income Tax Investigation: అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుందని రోహత్గీ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసులో జీఎస్టీ, ఆదాయపన్ను దర్యాప్తులు ఉన్నాయన్నారు. జీఎస్టీ, ఆదాయ పన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయని రోహత్గీ వాదించారు. నేరం జరిగిందా..? లేదా..?, ఎఫ్‌ఐఆర్‌ నమోదైందా..?, లేదా..? అంతవరకే పరిమితం కావాలన్నారు. అవినీతి నిరోధక, సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారన్న రోహత్గీ.. ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను ఎలా క్వాష్‌ చేస్తారని వాదించారు.

Advocate Harish Salve Heard Arguments Virtually: చంద్రబాబు తరఫున న్యాయవాది హరీష్‌ సాల్వే వర్చువల్‌గా వాదనలు వినిపిస్తూ.. చట్ట సవరణను ముందు నుంచి వర్తింప చేసే అంశంపై పలు తీర్పులను హరీష్‌ సాల్వే ఉటంకించారు. 2019 నాటి 'శాంతి కండక్టర్స్‌' కేసును, 1964 నాటి రతన్‌లాల్ కేసులను హరీష్‌ సాల్వే ప్రస్తావించారు.

Harish Salve Arguments: ''ఎన్నికల ముందు రాజకీయ కక్షసాధింపులకు అవకాశం ఉంటుంది. రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకే 17ఏ ఉంది. 17ఏ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుంది. ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదు. రిమాండ్‌ రిపోర్టు, కౌంటర్‌ అఫిడవిట్లు మొత్తం ఆరోపణలతో నిండి ఉన్నాయి. విపక్ష నేతను విచారించడం తమ హక్కుగా ఈ ప్రభుత్వం భావిస్తోంది. మొదట్లో ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు. రిమాండ్‌ సమయంలో చంద్రబాబు పేరు చేర్చారు. ఎలాంటి పరిస్థితులోనైనా 17ఏ వర్తిస్తుంది. 2016-17లో జరిపిన విచారణలో ఏమీ తేలలేదు. 2021లో మళ్లీ విచారణ ప్రారంభించి ఆధారాల కోసం వెతుకుతున్నారు'' అని హరీష్‌ సాల్వే వాదనలు వినిపించారు. 73 ఏళ్ల వయస్సు ఉన్న చంద్రబాబు 40 రోజులుగా జైలులో ఉన్నారు. దయచేసి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించండి. కోర్టు సెలవుల దృష్ట్యా మధ్యంతర బెయిల్‌పై పరిశీలించండి'' అని హరీష్‌ సాల్వే వర్చువల్‌గా వాదనలు వినిపించారు.

Achchennaidu on Chandrababu Naidu: ఏ తప్పు చేశారని చంద్రబాబును అరెస్ట్ చేశారు జగన్..? : అచ్చెన్నాయుడు

Supreme Court Reserved Judgment: చంద్రబాబును అరెస్టు చేసేముందు వరకు ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు లేదని, ఈ కేసులో చాలా మంది అధికారులను విచారించామని..చంద్రబాబు తరఫున న్యాయవాది హరీష్‌ సాల్వే తెలిపారు. కానీ, ఒక్కరికి కూడా 17ఏ నిబంధన కింద అనుమతి తీసుకోలేదన్నారు. నిబంధనలు పాటించలేదనడానికి ఇదే పెద్ద నిదర్శనమన్నారు. రేపు న్యాయసమీక్ష జరిగితే కేసు మొత్తం మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని హరీష్ సాల్వే పేర్కొన్నారు. జీఎస్టీ చెల్లింపుల విషయాలను ప్రభుత్వానికి ముడిపెడుతున్నారన్నారు. ప్రభుత్వం తరఫున జరిగిన అవినీతిగా చూపుతున్నారని, దేన్ని దేనితో ముడిపెడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. అవసరమైతే కోర్టుకు లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తానన్న సాల్వే ధర్మాసనానికి విజ్ఞప్తి చేయగా.. సుప్రీంకోర్టు ధర్మాసనం హరీష్‌ సాల్వే విజ్ఞప్తిని అంగీకరించింది. అనంతరం ఇరుపక్షాల న్యాయవాదుల వాదోపవాదాలు విన్న సుప్రీంకోర్ట్ ధర్మాసనం.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించిన విచారణను, తీర్పును రిజర్వ్‌ చేసింది.

Chandrababu Legal Mulakats Reduced: చంద్రబాబు లీగల్ ములాఖత్‌లకు కోత.. ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ టీడీపీ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.