ETV Bharat / bharat

జాబ్​ స్కామ్​ కేసులో CBI జోరు.. లాలూపై ప్రశ్నల వర్షం.. భార్యను విచారించిన మరుసటి రోజే.. - రైల్వే జాబ్ స్కామ్ లాలూ ప్రసాద్

Land For Jobs Scam : ఉద్యోగాల కుంభకోణం కేసులో మంగళవారం ఆర్​జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్​ను ప్రశ్నించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. అంతకుముందు సోమవారమే ఆయన సతీమణి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని విచారించింది సీబీఐ.

Land For Jobs Scam
Land For Jobs Scam
author img

By

Published : Mar 7, 2023, 12:40 PM IST

Land For Jobs Scam : రైల్వే ఉద్యోగాల కుంభకోణం కేసు దర్యాప్తులో జోరు పెంచింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). సోమవారం బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని విచారించిన సీబీఐ.. మంగళవారం ఆర్​జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్​ను ప్రశ్నించింది. ఐదుగురు అధికారులతో కూడిన సీబీఐ బృందం.. పండర పార్క్​లో ఉన్న మీసా భారతి ఇంటికి చేరుకుంది. గత కొంత కాలంగా ఆయన తన కూతురు రాజ్యసభ ఎంపీ, మీసా భారతి ఇంట్లోనే ఉంటున్నారు. సీబీఐ విచారణకు తాము పూర్తి సహకారం అందిస్తామని లాలూ కుటుంబ సభ్యులు తెలిపారు.

సోమవారం ఉదయం లాలూ సతీమణి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని ప్రశ్నించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. రబ్రీదేవి వాంగ్మూలాన్ని నమోదు చేశామని.. ప్రస్తుతం ఆమె నివాసంలో ఎలాంటి సోదాలు నిర్వహించడం లేదని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. రబ్రీదేవి అపాయిట్‌మెంట్‌ తీసుకున్న తర్వాతే ఆమెను ప్రశ్నించినట్లు సీబీఐ అధికారులు సోమవారం వెల్లడించారు. రాజ్యాంగ సంస్థలను కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు లేఖ రాసిన మరుసటి రోజే రబ్రీదేవి విచారించడంపై ఆర్జేడీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోదీకి రాసిన లేఖపై బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆమె కుమారుడు తేజస్వి యాదవ్ కూడా సంతకం చేశారని.. అందుకే కేంద్రం కక్ష సాధింపులకు పాల్పడుతోందని విమర్శించారు.
తన కుటుంబంపై సీబీఐ చేస్తున్న దాడులపై స్పందించారు బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్​. బీజేపీకి వ్యతిరేకంగా తమ కుటుంబం పోరాటం చేస్తుందనే ఇలా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు.. బీజేపీకి కొమ్ము కాస్తున్నాయని విమర్శించారు.

కేసు ఏంటంటే?
2004-2009 మధ్యలో లాలుప్రసాద్‌ యాదవ్‌ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వేల్లో గ్రూప్-డీ ఉద్యోగాలు ఇప్పించి.. ఆ డబ్బుతో భూమిని కొనుగోలు చేశారని సీబీఐ ఛార్జ్​షీట్​ దాఖలు చేసింది. పట్నా జోన్​కు చెందిన కొందరికి కోల్​కతా, ముంబయి, జైపుర్, జబల్​పుర్ వంటి జోన్లలో ఉద్యోగాలు ఇప్పించారని ఆరోపించింది. ఇందుకు బదులుగా ఆ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు.. తమ భూములను లాలూ ప్రసాద్​కు, ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి బదిలీ చేశారని సీబీఐ అభియోగ పత్రం దాఖలు చేసింది. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూ ప్రసాద్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా సమన్లు జారీ చేసింది. ఈ కేసుపైనే లాలూ ప్రసాద్ యాదవ్​ సహా రబ్రీదేవిని సీబీఐ విచారిస్తోంది. అంతకుముందు ఈ కేసులో ఫిబ్రవరి 27న లాలూ, రబ్రీదేవి సహా 14 మందికి నోటీసులు జారీ చేసింది.

ఇవీ చదవండి : సిసోదియా మెడపై ఈడీ కత్తి.. జైలులోనే విచారణ.. కరుడుగట్టిన నేరస్థుల మధ్యే..

జాబ్ స్కామ్​ కేసులో మాజీ సీఎంపై CBI ప్రశ్నలు.. విపక్షాలు లేఖ రాసిన మరుసటిరోజే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.