Car rammed youth ఝార్ఖండ్ గిరీడీహ్లో హోలీ పండగ రోజు ఓ కారు బీభత్సం సృష్టించింది. కొందరు యువకులు రోడ్డుపై రంగలు చల్లుకునే సమయంలో ఓ వాహనం అటువైపుగా వచ్చింది. దీంతో వారు దాన్ని ఆపి రంగులు జల్లేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా ఆగ్రహించిన డ్రైవర్ కారును యువకులపైనుంచి దూసుకుపోనిచ్చాడు. దీంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ తీరుతో కోపోద్రిక్తులైన స్థానికులు కారును ధ్వంసం చేశారు. అందులో ఉన్న డ్రైవర్, ప్యాసెంజర్లపై దాడి చేశారు. వెంటనే పోలీసుల రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు.
Jharkhand news
బెంగబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోట్కీ ఖార్గడీహా ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడ్డ యువకుడి పేరు వాసుదేవ్ తూరి అని, అతను వారి బంధువుల ఇంట్లో ఉంటున్నాడని వెల్లడించారు. అతని కాలికి తీవ్ర గాయమైందన్నారు. కారును పోలీస్ స్టేషన్కు తరలించాడు.
Giridih car news
ఘటన అనంతరం కారు డ్రైవర్, ప్యాసెంజర్లను కాపాడేందుకు ఓ హోటల్ ఆపరేటర్ ప్రయత్నించాడని స్థానికులు ఆరోపించారు. దీంతో వారు హోటల్ వద్ద గొడవకు దిగడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు వచ్చి వారిని సముదాయించారు.
ఇదీ చదవండి: ప్రత్యేక ఆకర్షణగా 'ట్రాన్స్జెండర్ కేఫ్'.. కస్టమర్లతో హౌస్ఫుల్!