ETV Bharat / bharat

క్యాబ్​ డ్రైవర్​ హత్య.. ఇంటి బయటే పూడ్చివేత!.. కారు అమ్మి సొమ్ము పంచుకోవాలని ప్లాన్​.. కానీ.. - ఇద్దరు వ్యక్తుల చేతిలో క్యాబ్ డ్రైవర్ మృతి

ఓ క్యాబ్​ డ్రైవర్​ను ఇద్దరు వ్యక్తులు ఉరివేసి చంపారు. అనంతరం అతడి మృతదేహాన్ని పూడ్చివేశారు. మృతుడి కారును అమ్మి.. వచ్చిన సొమ్మును పంచుకోవాలి అనుకున్నారు. కానీ మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మొత్తం బాగోతం బయటపడింది. అసలేం జరిగిందంటే?

cab-driver-killded-by-two-people-in-chhattisgarh-drishyam-seen-repeated-in-chhattisgarh
క్యాబ్​ డ్రైవర్​ హత్య
author img

By

Published : Apr 27, 2023, 10:49 PM IST

ఓ క్యాబ్​ డ్రైవర్​ను తాడుతో ఉరివేసి హత్య చేశారు ఇద్దరు వ్యక్తులు. అనంతరం అతడి మృతదేహాన్ని పూడ్చి వేశారు. మృతుడి కారును అమ్ముకుని.. వచ్చిన సొమ్మును చెరి సగం పంచుకోవాలని పన్నాగం పన్నారు. ఏప్రిల్​ 15న పథకం ప్రకారం ఆన్​లైన్​లో క్యాబ్​ను బుక్​ చేసుకున్న నిందితులు.. అనంతరం ఈ దారుణానికి పాల్పడ్డారు. ఛత్తీస్​గఢ్ రాజధాని రాయ్​పుర్​లో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సునీల్ వర్మ ఓ క్యాబ్​ డ్రైవర్​. అతడు పురాని బస్తీ పోలీస్​ స్టేషన్ పరిధిలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఏప్రిల్​ 15 రాత్రి తపన్ బంధే, రాకేశ్​ కుర్రే అనే ఇద్దరు వ్యక్తులు.. సునీల్​ వర్మ క్యాబ్​ను బుక్​ చేసుకున్నారు. క్యాబ్​ వచ్చిన వెంటనే.. అభాన్​పుర్​ పోలీసు స్టేషన్ పరిధిలోని కోలా గ్రామ సమీపంలో ఉన్న ఓ కెనాల్​ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం ఇద్దరు కలిసి క్యాబ్​డ్రైవర్​ సునీల్ వర్మ హత్యచేశారు. కారులోనే మృతదేహాన్ని ఉంచి అక్కడి నుంచి పరారయ్యారు. మరుసటి రోజు వచ్చి.. సునీల్​ వర్మను నిందితుల్లో ఒకరి ఇంటి పరిసరాల్లో పూడ్చి వేశారు.

అయితే సునీల్​ వర్మ హత్య జరిగిన మరుసటి రోజే.. అతడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సునీల్​ వర్మ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపారు. సునీల్​ వర్మ హత్య గురించి ఓ ఇన్​ఫార్మర్​ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారణ చేయగా వారు నిజాన్ని ఒప్పుకున్నారు. సునీల్​ను పాతి పెట్టిన స్థలాన్ని పోలీసులకు చూపించారు. అనంతరం బుధవారం జేసీహీ సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.

క్యాబ్​ డ్రైవర్​ హత్య.. ఇంటి సమీపంలో పూడ్చివేత

'దృశ్యం' సినిమా​ రిపీట్​..! భార్యను హత్య చేసి ఇంట్లోనే ఖననం..
భార్యను హతమార్చి అనంతరం ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టాడు ఓ భర్త. కేరళలోని కొచ్చిలో ఈ దారుణం జరిగింది. ఘటన ఏడాది తరువాత విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. 2021, ఆగస్టు 16న సంజీవ్​.. తన భార్య రమ్యను గొంతు కోసి చంపాడు. తర్వాత ఆమె శవాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టాడు. అనంతరం ఏమీ తెలియనట్లుగా 2022 ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆగస్టు 2021 నుంచి తన భార్య కనిపించడం లేదంటూ వారికి చెప్పాడు. మొదటి నుంచి సంజీవ్​పై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. అతనిపై ప్రత్యేక నిఘా ఉంచారు. సంవత్సరం పైగా ఈ కేసులో విచారణ జరిపి.. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.