ETV Bharat / bharat

పిన్నీసులు విక్రయించే కుటుంబంపై వివక్ష- బస్సులోంచి దించేసి..! - అమానుషం

Bus driver suspended: అణగారిన వర్గాలను హీనంగా చూడటం దేశంలో ఏదో ఒక చోట వెలుగు చూస్తూనే ఉంది. బస్సులో ఎక్కిన ఓ వృద్ధుడు, మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించారు కండక్టర్​, డ్రైవర్​. బస్​ నుంచి దింపేసి వెళ్లారు. ఈ సంఘటన తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగింది.

conductor suspended
వృద్ధులను బస్​ నుంచి దింపేసిన కండక్టర్
author img

By

Published : Dec 10, 2021, 6:53 PM IST

వృద్ధులను బస్​ నుంచి దింపేసిన కండక్టర్

Bus driver suspended: బలహీనవర్గాలకు చెందిన వారిని హీనంగా చూడటం, వివక్ష, వారిపై తప్పుడు కేసులు పెట్టడం వంటి అంశాలను ఇటీవల వచ్చిన 'జై భీమ్​' సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాంటి సంఘటనే తమిళనాడు, కన్యాకుమారిలో జరిగింది. ఫలితంగా అమానవీయంగా ప్రవర్తించిన బస్​ డ్రైవర్​, కండక్టర్​ సస్పెండయ్యారు.

ఇదీ జరిగింది..

వల్లియూర్​ గ్రామంలోని నరిక్కురవార్స్​ సమాజానికి చెందిన కొందరు నాగర్​కోయిల్​ బస్టాండ్​లో సూదులు, గొలుసులు, పిన్నీసులు వంటివి విక్రయిస్తుంటారు. సాయంత్రానికి తిరునెల్వెలి రూట్​ బస్​ ద్వారా స్వగ్రామానికి చేరుకుంటారు. గురువారం(డిసెంబర్​ 9న) నరిక్కురవార్స్​కు చెందిన ఓ వృద్ధుడు.. చిన్న పిల్లాడు, మహిళతో వల్లియూర్​కు వెళ్లేందుకు నాగర్​కోయిల్​ బస్టాండ్​లో బస్​ ఎక్కారు. కొద్ది సమయానికి కండక్టర్​ వారిని కోపగించుకుంటూ కిందకు దింపేశాడు. వారి సామగ్రిని బస్సులోనుంచి కింద పడేశాడు. ఈ సంఘటనను ఓ యువకుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశాడు. దాంతో ఆ దృశ్యాలు వైరల్​గా మారాయి.

ఆ వీడియో ఉన్నతాధికారులకు చేరగా.. బస్​ డ్రైవర్​ నెల్సన్​(45), కండక్టర్​ జయదాస్​(44)లను సస్పెండ్​ చేశారు నాగర్​కోయిల్​ రవాణా శాఖ జోనల్​ జనరల్​ మేనేజర్​.

మరోవైపు.. బస్సులో వృద్ధుడు, మహిళ గొడవపడ్డారని, ఇతర ప్రయాణికులకు ఇబ్బందిగా మారినట్లు బస్​ కండక్టర్​ తెలిపారు. అందుకే వారిని బస్సులో నుంచి దింపేసినట్లు చెప్పుకొచ్చారు.

ఇలాంటి సంఘటనే కొద్ది రోజుల క్రితం జరిగింది. చేపలు విక్రయించే మహిళను కన్యాకుమారిలో ప్రభుత్వ బస్​ నుంచి దింపేసిన వీడియో వైరల్​గా మారింది.

ఇదీ చూడండి: International Human rights: ఆధిపత్య భావనే అనర్థాలకు మూలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.