ETV Bharat / bharat

'బుల్​డోజర్లు రిపేర్​లో ఉన్నాయ్.. ఫలితాల తర్వాత వారి పని పడతాయ్​!' - Mainpuri elections

UP Election Yogi Buldozer comments: నేరస్థులపై తమ ప్రభుత్వ వైఖరిని గుర్తుచేస్తూ బుల్​డోజర్ల గురించి మాట్లాడారు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​. ప్రస్తుతం వాటన్నింటినీ రిపేరుకు పంపించామని, మార్చి 10 తర్వాత వారి పని పడతాయని వ్యాఖ్యానించారు.

Bulldozers under repair now
Bulldozers under repair now
author img

By

Published : Feb 18, 2022, 7:10 PM IST

UP Election Buldozer: రాష్ట్రంలోని అన్ని బుల్​డోజర్లను రిపేర్​ కోసం పంపించామని అన్నారు ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​. మెయిన్​పురీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నేరస్థుల అక్రమాస్తులను కూల్చివేసేందుకు యూపీ ప్రభుత్వం గతంలో బుల్​డోజర్లను ఉపయోగించింది. ఈ సందర్భంగానే 'ఎన్నికల సమయంలోనూ బుల్​డోజర్లను ఉపయోగిస్తారా?' అన్న సమాజ్​వాదీ పార్టీ నేతకు ఇలా బదులిచ్చారు యోగి.

'''ఎన్నికల సమయంలోనూ బుల్​డోజర్లను ఉపయోగిస్తారా?' అని ఎస్పీ సీనియర్​ నేత ఒకరు అడిగారు. కొన్నిసార్లు బుల్​డోజర్లకు కూడా విశ్రాంతి అవసరం. కాబట్టి చింతించవద్దని ఆయనకు చెప్పాను. అందుకే ఎన్నికల సమయంలో.. బుల్​డోజర్లను మరమ్మతుల కోసం పంపించాం.''

- యోగి ఆదిత్యనాథ్​, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి

Yogi Adityanath: గత నాలుగున్నరేళ్లుగా దాక్కొని, ఎన్నికల ప్రకటన వెలువడగానే కొందరు బయటకు వస్తున్నారని.. వారిని గుర్తించి మార్చి 10 తర్వాత బుల్​డోజర్లను ఉపయోగిస్తామని అన్నారు యూపీ సీఎం.

నేరస్థుల మనసులు, ఆలోచనల్లో భయం ఉంటే తప్ప.. వ్యవస్థ సక్రమంగా నడవదని అభిప్రాయపడ్డారు యోగి ఆదిత్యనాథ్​. నేరస్థులు తప్పుచేయాలని ఆలోచిస్తే.. మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వారికి ఇప్పటికే అర్థమై ఉంటుందని పేర్కొన్నారు.

విస్తృతంగా ప్రచారం..

మెయిన్​పురీలో ఫిబ్రవరి 20న మూడో విడతలో భాగంగా ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 7 దశల్లో పోలింగ్​ నిర్వహించనుండగా.. మార్చి 10న ఫలితాలు వెలువడుతాయి.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో మెయిన్​పురీలోని నాలుగు నియోజకవర్గాల్లో మూడింట ఎస్పీ గెలవగా.. ఒక్కచోట భాజపా గెలుపొందింది. ఈసారి అన్ని స్థానాలను దక్కించుకోవాలనే లక్ష్యంతో.. సీఎం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

యూపీలో బుల్డోజర్ల గురించి తెలంగాణకు చెందిన భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్​ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో.. భాజపాకు ఓటు వేయని వారి ఇళ్లపైకి బుల్​డోజర్లను, జేసీబీలను పంపిస్తామని హెచ్చరించారు. యోగి ఆదిత్యనాథ్​కు ఓటు వేయని వాళ్లంతా యూపీ నుంచి వెళ్లిపోవాలని అన్నారు. ఈ నేపథ్యంలో యోగి.. బుల్​డోజర్ల గురించి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

ఇవీ చూడండి: భాజపాలో లుకలుకలు.. ఉత్తరాఖండ్​లో గెలుపుపై అనుమానాలు!

'కాంగ్రెస్​ గెలిస్తే మహిళలకు నెలకు రూ.1100, లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.