ETV Bharat / bharat

పెళ్లి మండపంలోనే రూ.11లక్షల కట్నం తిరిగిచ్చేసిన అల్లుడు.. రూపాయి తీసుకుని.. - వరకట్నాన్ని కాదన్న అల్లుడు

వరకట్న దాహంతో భార్యలను వేధించే భర్తలను చూసుంటాం. ముహూర్తానికి ముందు అనుకున్నంత కట్నం ఇవ్వకపోతే వివాహం రద్దు చేసే వారినీ చూసుంటాం. అయితే ఉత్తరాఖండ్​లోని ఓ అల్లుడు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతున్నాడు.

Bridegroom returns dowry to parents-in-law
Bridegroom returns dowry to parents-in-lawc
author img

By

Published : Dec 3, 2022, 4:22 PM IST

వరకట్నం కోసం కట్టుకున్న భార్యతో పాటు ఆమె పుట్టింటి వారిని వేధించే వ్యక్తులున్న ఈ కాలంలో తనకొచ్చిన కట్నాన్ని కాదని తిరిగి అత్తమామలకు ఇచ్చేశాడు ఓ అల్లుడు. ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​కు చెందిన ఈ వరుడు చేసిన పనితో సమాజంలోని పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. ఇక వధువు కుటుంబసభ్యుల ఆనందం అంతా ఇంతా కాదు.

సౌరభ్ చౌహాన్ అనే రెవెన్యూ అధికారికి.. విశ్రాంత ఆర్మీ జవాన్​ కూతురు ప్రిన్స్​కు శుక్రవారం తిటావి పోలీస్ స్టేషన్ పరిధిలోని లఖన్ గ్రామంలో వివాహం జరిగింది. ఆచారాల్లో భాగంగా అతడికి రూ.11 లక్షల నగదుతో పాటు కొన్ని ఆభరణాలను ఇచ్చారు. అయితే వరుడు వాటన్నింటినీ తిరిగి ఇచ్చి ఒక్క రూపాయిని మాత్రమే తీసుకున్నాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతడ్ని ప్రశంసలతో ముంచెత్తారు. సౌరభ్​ను చూసి ఈ సమాజం ఎంతో నేర్చుకోవాలని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.