Bride Wedding With No Jewellery: పెళ్లంటే.. ఖరీదైన బట్టలు, నగలతో మహిళలు ముస్తాబవుతారు. ఇక పెళ్లికూతురుకైతే ఒంటినిండా ఆభరణాలు ధరించే రోజులివి. కానీ కేరళకు చెందిన ఓ వధువు నగలు వేసుకోకుండానే వివాహం చేసుకుంది. ఆ డబ్బులతో పేదలకు సహాయం చేసింది.
కోజికోడ్, మయపయ్యూర్కు చెందిన అంత్రు-రంలా దంపతుల కుమార్తె షెహ్నా షెరి. కొట్టపల్లికి చెందిన మహమ్మద్ షఫీతో ఆమె పెళ్లి నిశ్చయమైంది. షెహ్నా తన వివాహాన్ని సాధారణంగా జరుపుకుని మిగిలిన డబ్బులను పేదలకు సహాయం చేయాలనుకుంది. ఆమె నిర్ణయాన్ని తల్లిదండ్రులు, వరుడు కూడా అంగీకరించారు. దీంతో నిరాడంబరంగా పెళ్లితంతు ముగించారు.
Simple Bride Wedding: 21 సెంట్ల భూమిని నిరుపేదలైన నాలుగు కుటుంబాలకు ఇచ్చారు. దగ్గరిలోని డయాలసిస్ సెంటర్కు డబ్బులను దానంగా ఇచ్చారు. ఓ పేద వ్యక్తికి ఇంటిని నిర్మించారు. మరో వ్యక్తి ఆస్పత్రి చికిత్సకు డబ్బును సహాయం చేశారు. ఓ పేద అమ్మాయి వివాహ ఖర్చును భరించారు. వీరి నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
ఇదీ చదవండి: ఇంటి మిద్దెపై ద్రాక్ష తోట.. ఆ రైతు చేసిన అద్భుతం