ETV Bharat / bharat

ప్రియుడ్ని పెళ్లికి పిలిచిన ప్రియురాలు.. అతడు చేసిన పనితో గెస్ట్​లంతా షాక్ - ఉత్తర్​ప్రదేశ్ న్యూస్

ప్రియురాలి వివాహం జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న ప్రియుడు.. పెళ్లికి వచ్చి వరుడ్ని పక్కకు నెట్టి వధువు మెడలో దండ వేసి బొట్టు పెట్టాడు. ఈ ఘటన బిహార్​లోని నలందలో జరిగింది. దీంతో వరుడు వివాహానికి నిరాకరించాడు. మరో ఘటనలో వరుడు తన కన్నా రెట్టింపు వయసు ఉన్నాడని పెళ్లికి నిరాకరించింది మైనర్​ వధువు.

Unique Marriage in Nalanda
Unique Marriage in Nalanda
author img

By

Published : Jul 8, 2022, 5:48 PM IST

బిహార్ నలందలో ఓ వివాహంలో వింత సంఘటన జరిగింది. ప్రియురాలి పెళ్లి జరుగుతుండగా అకస్మాత్తుగా వేదికపైకి వచ్చిన ప్రియుడు.. వరుడ్ని పక్కకు నెట్టి వధువు మెడలో దండ వేసి బొట్టు పెట్టాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వధువు కుటుంబ సభ్యులు ప్రియుడిని చితకబాదారు. దీంతో వరుడు వివాహానికి నిరాకరించాడు. ఈ సన్నివేశాన్ని చూసిన అతిథులంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

ప్రియుడ్ని పెళ్లికి పిలిచిన ప్రియురాలు.. ఏం చేశాడంటే!

హర్నౌత్​ పోలీస్​ స్టేషన్ పరిధిలోని ముబారక్​పుర్​ గ్రామానికి చెందిన ముఖేశ్, ఓ యువతి ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. యువతి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడం వల్ల ఆమెకు పెళ్లి నిశ్చయించారు. ఈ క్రమంలోనే మంగళవారం వివాహం జరగుతుండగా ముఖేశ్​ పెళ్లికి వచ్చాడు. వధువరూలు దండలు మార్చుకుంటుండగా వేదికపై వచ్చి.. వధువు మెడలో దండ వేసి బొట్టు పెట్టాడు.

"మేమిద్దరం ఒకరినోకరం ప్రేమించుకున్నాం. మా విషయం వారి ఇంట్లో తెలియడం వల్ల పెళ్లి నిశ్చయించారు. రేపు నా పెళ్లని.. నువ్వు వచ్చి పెళ్లి చేసుకోవాలని ఆమె ఫోన్​ చేసి చెప్పింది."

-ముఖేశ్​, ప్రియుడు

ఇదంతా చూసిన వరుడు పెళ్లి చేసుకోకుండానే వెళ్లిపోయాడు. అయితే, వధువు కుటుంబ సభ్యులు మాత్రం.. ముఖేశ్​ చెప్పేవన్నీ అబద్దాలని చెబుతున్నారు. ప్రస్తుతం వారిద్దరూ ప్రేమించుకోవడం లేదని అంటున్నారు. ఈ విషయంపై ఫిర్యాదు అందిందని.. విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

వయసు ఎక్కువని పెళ్లికి నో చెప్పిన వధువు: మరోవైపు.. వరుడు తన కన్నా రెట్టింపు వయసు ఉన్నాడని పెళ్లికి నిరాకరించింది మైనర్​ వధువు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని భర్తనా పట్టణంలో జరిగింది. మరొకరి ఫొటోను చూపించి పెళ్లికి ఒప్పించారని వధువు తెలిపింది. ఆమె ఒప్పుకోకపోవడం వల్ల పెళ్లి జరగకుండానే వరుడు కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు.

కొత్వాలి పరిధిలోని నాగ్లాబాగ్​ గ్రామానికి చెందిన ఓ మైనర్​కు వివాహం చేయడానికి తల్లి, ఆమె మేనమామ నిశ్చయించారు. సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. జాఫర్​పుర గ్రామానికి చెందిన రవికుమార్ కుటుంబ సభ్యులు.. మరొకరి ఫొటోను చూపించి పెళ్లికి ఒప్పించారు. వరుడ్ని చూపించాలని వధువు కుటుంబ సభ్యులు పలుమార్లు అడగగా.. దూర ప్రాంతంలో పనిచేస్తున్నారని నమ్మబలికారు. పెళ్లికి సిద్ధంకాగా, వరుడ్ని చూసిన వధువు తన వయసు కన్నా రెట్టింపు ఉన్నాడని పెళ్లికి నిరాకరించింది. వధువు తల్లి, మేనమామ పెళ్లికి ఒత్తిడి చేసినా ఒప్పుకోలేదు.

అయితే వధువు తరఫు కుటుంబ సభ్యులు తమ బంగారం, నగదును తీసుకున్నారని వరుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పెళ్లి జరగకముందే ఇవన్నీ ఎలా ఇస్తారని.. వారు చేసిన ఆరోపణలు తప్పని వధువు తల్లి చెప్పింది. దీనిపై గొడవ పడిన ఇరు పక్షాల కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్​ ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: స్నేహం ప్రూవ్​ చేసుకోవాలని కాలువలోకి దూకిన ముగ్గురు.. చివరకు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.