ETV Bharat / bharat

స్మార్ట్​ఫోన్ గిఫ్ట్ తిరిగివ్వలేదని.. ప్రియురాలి గొంతు కోసి.. - Boyfriend Killed His Lover in Jarkhand

Boyfriend Killed His Lover: కానుకగా ఇచ్చిన స్మార్ట్​ఫోన్ తిరిగివ్వలేదని ప్రేయసిని గొంతు కోసి హత్య చేశాడో ప్రియుడు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్​లోని పాకుర్ జిల్లాలో జరిగింది.

Boyfriend Killed His Lover
హత్య
author img

By

Published : Apr 5, 2022, 4:55 AM IST

Boyfriend Killed His Lover: తాను కానుకగా ఇచ్చిన స్మార్ట్​ఫోన్ తిరిగివ్వలేదని ప్రేయసిని గొంతు కోసి హత్య చేశాడో ప్రియుడు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్​లోని పాకుర్ జిల్లాలో జరిగింది. 'బాలిక(17)తో నిందితుడు గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. తరచూ అమ్మాయి గదికి వస్తుండేవాడు. అప్పుడప్పుడు రాత్రుళ్లు కూడా అక్కడే గడిపేవాడు. అతని వివాహం మరో అమ్మయితో కుదిరింది. దీంతో తాను కానుకగా ఇచ్చిన సెల్​ఫోన్​ను తిరిగి ఇవ్వాలని ప్రేయసిని అడిగాడు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయంలో ఇరువురు గొడవపడ్డారు. ఆదివారం రాత్రి ఫుట్​బాల్ మ్యాచ్​కు నిందితునితో కలిసి వెళ్లిన తర్వాత అమ్మాయి కనిపించకుండా పోయింది' అని బాధితురాలు మామయ్య తెలిపారు.

ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఆచూకీని కనుగొన్నారు. నిర్జన ప్రదేశంలో ఆ అమ్మాయి మృతదేహం కనిపించిందని తెలిపారు. ఈ కేసులో నిందితున్ని అరెస్టు చేశారు. 'ఫుట్​బాల్ మ్యాచ్​ నుంచి తిరిగివస్తుండగా.. పదునైన ఆయుధంతో తన ప్రియురాలి గొంతును కోసినట్లు నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. అనంతరం ఘటనస్థలం నుంచి పారిపోయాడు.' అని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి: భూమి లాక్కొని అక్రమ మైనింగ్​.. విషం తాగి రైతు ఆత్మహత్య!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.