సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్.. పాత ఇంటి వద్ద బాంబు పేలుళ్ల ఘటన తీవ్ర కలకలం రేపింది. బైక్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. రెండు బాంబులను విసిరి పరారయ్యారు.
ఉత్తర్‌ప్రదేశ్, ప్రయాగ్‌రాజ్, హషిమ్పుర్లోని కొలోనిల్గంజ్లో జస్టిస్ అశోక్ భూషణ్ నివాసం ఉంది. అయితే ప్రస్తుతం ఆ ఇంట్లో అశోక్ భూషణ్ సోదరుడు అనిల్ భూషణ్ ఉంటున్నారు. ఆయన ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. బాంబు దాడి జరిగిన వెంటనే హుటాహుటిన పోలీసు బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. డీఐజీ త్రిపాఠీ.. అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఈ ఘటనపై కొలోనిగంజ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కారణం అదేనా..
జస్టిస్ అశోక్ భూషణ్ పాత ఇంటి పక్కనే నివాసం ఉంటున్న రెండు వర్గాల మధ్య చాలాకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరొక వర్గాన్ని భయపెట్టేందుకు ఇంకో వర్గం వారు బాంబు దాడి చేసి ఉంటారని.. ఐజీ రేంజ్ అధికారి కేపీ సింగ్ తెలిపారు. సీసీటీవీలో నిందితులను గుర్తించామని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు.
ఇదీ చదవండి: పాఠశాలలోనే బాలుడి దారుణ హత్య