ETV Bharat / bharat

'కశ్మీర్​లో వాళ్లందరికీ ఏకే-47లు ఇవ్వాలి' - జమ్ముకశ్మీర్​ న్యూస్

కశ్మీర్​లో స్థానికేతరులందరికీ ఏకే-47లు ఇవ్వాలని డిమాండ్ చేశారు భాజపా ఎమ్మెల్యే జ్ఞానేంద్ర సింగ్ జ్ఞాను. అక్కడ వేరే రాష్ట్రాలకు చెందిన వారిని ఉగ్రవాదులు కాల్చి చంపుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

BJP MLA Gyanendra Singh Gyanu demands 'AK47 for outsiders in Kashmir'
'కశ్మీర్​లో వాళ్లందరికీ ఏకే 47లు ఇవ్వాలి'
author img

By

Published : Oct 19, 2021, 3:29 PM IST

జమ్ముకశ్మీర్​లో స్థానికేతరులు లక్ష్యంగా ఉగ్రవాదులు వరుస దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో బిహార్ భాజపా ఎమ్మెల్యే జ్ఞానేంద్ర సింగ్ జ్ఞాను అరుదైన డిమాండ్ చేశారు. కశ్మీర్​లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారందరికీ ఏకే-47లు ఇవ్వాలన్నారు. దీనివల్ల ఉగ్రవాదులతో వారు పోరాడగలరని అభిప్రాయపడ్డారు. శ్రీనగర్​లో బిహార్​కు చెందిన పానీపూరి వ్యాపారిని ఉగ్రవాదులు కాల్చిచంపిన ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది అత్యంత బాధాకరమన్నారు.

"కశ్మీర్​లో నిరాయుధులు, పేదవాళ్లను చంపడం దారుణం. పాకిస్థాన్​ ఉగ్రవాదుల సహకారంతోనే ఈ దుండగులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం భద్రతను మరింత పటిష్ఠం చేస్తే ప్రజలు ప్రశాంతంగా జీవించి వ్యాపారాలు చేసుకోగలరు. రాజ్యాంగ సవరణ చేసి కశ్మీర్​లోని స్థానికేతరులకు ఏకే-47 లైసెన్సులు ఇవ్వాలి. వాళ్లకు ఆయుధాలు ఉచితంగా ఇస్తే ముష్కరులతో పోరాడగలరు."

- భాజపా ఎమ్మెల్యే జ్ఞానేంద్ర సింగ్ జ్ఞాను

కశ్మీర్​లో తమ ప్రాంత ప్రజలపై దాడులు జరుగుతుండటంపై బిహారీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇదే విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను హిందుస్థాన్​ ఆవామ్​ మోర్చా(హెచ్​ఏఎం) అధినేత జితన్​ రాం మాంఝీ ప్రశ్నించారు. కశ్మీర్​లో పౌరుల భద్రతకు కేంద్రం ఎలాంటి ప్రాణాళిక రూపొందిస్తోందని ట్విట్టర్​​ వేదికగా అడిగారు. ఒకవేళ కేంద్రం సమస్యను పరిష్కరించలేకపోతే.. బిహారీలకే ఆ బాధ్యత అప్పగించాలన్నారు. 15 రోజుల్లో తాము పరిస్థితిని చక్కదిద్దుకోగలమని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులు బిహారీ సోదరులను కాల్చి చంపడం అత్యంత బాధాకరమన్నారు.

కశ్మీర్​లో పానీపూరీ వ్యాపారిని కాల్చి చంపిన ఘటన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి: స్థానికేతరుల్లో గుబులు- కశ్మీర్ విడిచి వెళ్తున్న కూలీలు

కశ్మీర్​లో వరుస హత్యలు.. అమిత్ షా ఉన్నతస్థాయి సమీక్ష!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.