ETV Bharat / bharat

'ట్రిలియన్ డాలర్ ఎకానమీగా గుజరాత్.. ఉమ్మడి పౌరస్మృతి అమలు'.. మేనిఫెస్టోలో భాజపా హామీలు - సంకల్ప్​ పత్రా భాజపా

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి సన్నహాలు చేస్తున్న కాషాయదళం శనివారం మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రజల వద్ద నుంచి సేకరించిన సలహాల ద్వారా ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు భాజపా తెలిపింది.

BJPs manifesto for Gujarat Assembly polls

author img

By

Published : Nov 26, 2022, 1:00 PM IST

Updated : Nov 26, 2022, 2:58 PM IST

Gujarat Election 2022: గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది అధికార భాజపా. ఉచిత విద్య, ఉమ్మడి పౌరస్మృతి అమలు వంటి హామీలను అందులో పేర్కొంది. భాజపా జాతీయ కార్యదర్శి జేపీ నడ్డా, గుజరాత్​ ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్​తో పాటు రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్​ భూపేంద్ర పాటిల్​ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రజల వద్ద నుంచి సేకరించిన సలహాలు, సూచనలు దృష్టిలో ఉంచుకుని ఈ మేనిఫెస్టోను తయారు చేశామన్నారు. వివిధ జిల్లాల్లో మంత్రులతో పాటు యువమోర్చా ద్వారా పలు కార్యక్రమాల ద్వారా సలహాలు సేకరించినట్లు తెలిపారు. సుమారు 12 వేల సజెషన్​ బాక్సులు, మిస్డ్ కాల్స్ పోల్​, వెబ్‌సైట్ పోల్​, వాట్సాప్ పోల్​ల సమాహారమే ఈ 'సంకల్ప పత్రం' అని నడ్డా పేర్కొన్నారు.

BJPs manifesto for Gujarat Assembly polls
'సంకల్ప పత్ర'ను విడుదల చేసిన జేపీ నడ్డా

మేనిఫెస్టోలోని కొన్ని కీలక అంశాలు

  • గుజరాత్ పురోగతి కోసం రాష్ట్రాన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడం. గుజరాత్ ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు సమానంగా తీర్చిదిద్దడం.
  • ప్రజా ఆస్తులకు నష్టం కలిగించేవారి నుంచే పరిహారం వసూలు చేస్తాం. ఇందుకు సంబంధించి చట్టాన్ని అమల్లోకి తెస్తాం. సంఘ విద్రోహకులు ప్రభుత్వ లేదా ప్రైవేట్​ ఆస్తులకు నష్టం చేకూరిస్తే వారిపై చర్యలు తీసుకునేలా చేస్తాం.
  • గుజరాత్ ఉమ్మడి పౌరస్మృతి కమిటీ సిఫార్సులను పూర్తిగా అమలు చేస్తాం.
  • ఉగ్రవాదులతో పాటు స్లీపర్​ సెల్స్​ను నిర్మూలించేందుకు యాంటీ రాడికలైజేషన్ సెల్‌ను స్థాపిస్తాం.
  • బాలికలకు కేజీ టు పీజీ ఉచిత విద్య.
  • సుమారు 48,00,000 మంది రైతులకు వడ్డీ మాఫీ. 13 లక్షల రైతు కుటుంబాలకు సాగునీరు సరఫరా.
  • 21 లక్షల హెక్టార్ల ఆయకట్టును సాగునీటి పథకంలో చేర్చడం.
  • 1.85 లక్షల మంది ఉపాధ్యాయుల నియామకం. 19 కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటు.
  • రూ.10 వేల కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన.
  • సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లో సీ ఫుడ్ పార్కుల ఏర్పాటు
  • రూ.10 వేల కోట్లతో 3 సివిల్ ఆర్బిట్రేషన్ల ఏర్పాటు.
  • 20 వేల ప్రభుత్వ పాఠశాలలను అద్భుతమైన పాఠశాలలుగా తీర్చిదిద్దడం.
  • కార్మికులకు శ్రామిక్ క్రెడిట్ కార్డ్, రూ.2 లక్షల వడ్డీ లేని రుణం, ఎస్సీ, ఓబీసీ, ఎస్టీ, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఒకేసారి రూ.50,000 విద్య ప్రోత్సాహకం అందజేత.
  • ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన కింద ఉచిత వైద్యంతో పాటు ప్రతి కుటుంబానికి వార్షికంగా చికిత్స​ కోసం 10 లక్షల రూపాయిలు.
  • వనబంధు కల్యాణ యోజన 2.0 ద్వారా 56 ప్రాంతాలకు వ్యాన్ల ద్వారా రేషన్​ సరఫరా.
  • అంబాజీ- ఉమర్​గామ్​ మధ్య నాలుగు నుంచి ఆరు లైన్ల రహదారి అయిన బిర్సా ముండా ఆదివాసీ సమృద్ధి కారిడార్​ నిర్మాణం.
  • ప్రధానమంత్రి ఆవాస్​ యోజన కింద అర్హులకు ఉచిత గృహ నిర్మాణ హామీ.
  • గిరిజన ప్రాంతాల్లో అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందించేందుకు 8 మెడికల్​, 10 పారా మెడికల్​ కాలేజీల నిర్మాణం.
  • దేశంలోనే తొలిసారిగా 3,000 కి.మీ మేర వృత్తాకార మార్గం నిర్మాణం. మొత్తం గుజరాత్‌ను కవర్ చేసేలా 4-6 లేన్‌ల పొడవైన 'పరిక్రమ మార్గం' నిర్మాణం.
  • గాంధీనగర్, సూరత్ మెట్రో కార్యకలాపాలు నిర్ణీత గడువులోపు పూర్తి. సౌరాష్ట్ర(రాజ్‌కోట్), సెంట్రల్​ గుజరాత్ (వడోదర) మొదటి మెట్రో రైలు సర్వీస్‌ వేగవంతంగా ప్రారంభం.

ఆధ్యాత్మిక హామీలు

  • ద్వారకను పశ్చిమ భారతదేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేందుకు సంకల్పం. 'దేవభూమి ద్వారకా కారిడార్' ఏర్పాటు. ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీ కృష్ణుడి విగ్రహం, త్రీడీ శ్రీమద్ భగవద్గీత ఎక్స్​పీరియెన్స్ జోన్​తో పాటు గ్యాలరీ నిర్మాణం.
  • దేవాలయాల పునరుద్ధరణతో పాటు విస్తరణలో భాగంగా సోమనాథ్, అంబాజీ, పావగఢ్ కోసం రూ.1,000 కోట్లు కేటాయింపు. జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో గుజరాత్ సాంస్కృతిక వారసత్వ ప్రాముఖ్యతను పెంచడానికి 2,500 కోట్ల రూపాయల పెట్టుబడి.
  • పశువుల సంపూర్ణ సంరక్షణను నిర్ధారించడానికి, గోశాలలు మౌలిక సదుపాయాల పరంగా బలోపేతం. అదనంగా 1,000 సంచార పశువైద్య యూనిట్లు నిర్మాణం. ప్రతి పశువులకు టీకాలు వేయడంతో పాటు బీమా సౌకర్యం.

Last Updated : Nov 26, 2022, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.