Biryani Bill 3 lakhs In Hospital: బిర్యానీ ధర ఎంత అనగానే వందో, రెండు వందలో అని చెప్పేస్తాం. కానీ ఓ వ్యక్తి బిర్యానీకి రూ. 3లక్షల బిల్లు పెట్టాడు. ఇది చూసి కంగుతిన్న అధికారులు దీనిపైన విచారణకు ఆదేశించారు. ఈ ఘటన బంగాల్లోని కత్వా సబ్‌డివిజనల్ ఆస్పత్రిలో జరిగింది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా సౌవిక్ ఆలం ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను చూసి షాకయ్యారు. బిర్యానీ కోసం దాదాపు రూ.3 లక్షలు వెచ్చించినట్లు బిల్లు దాఖలు చేశాడు ఓ కాంట్రాక్టర్.
కింగ్షుక్ అనే కాంట్రాక్టర్ ఆస్పత్రికి వివిధ రకాలైన వస్తువులను సరఫరా చేస్తాడు. ఫర్నీచర్, ఫార్మసీ, కారు ఖర్చుతో పాటు అనేక ఇతర బిల్లులను కలిపి సుమారు రూ.3 కోట్లు పెట్టాడు. సౌవిక్ వీటిని పరిశీలించగా.. 81 రకాల నకిలీ బిల్లులు కనిపించాయి. దీంతో పేషెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించారు. వైద్య ఆరోగ్య శాఖ కూడ నకిలీ బిల్లుల విషయాన్ని ధ్రువీకరించింది. బిల్లుపై సంతకం చేసిన ప్రతి ఆరోగ్య కార్యకర్తను విచారిస్తామని.. దోషులుగా తేలితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: భర్త రెండో పెళ్లి.. కోపంతో ఇంటిని తగలబెట్టిన మొదటి భార్య