Bihar Uterus Removal Scam : బిహార్‌లో 27 వేల మంది మహిళల గర్భాశయాల తొలగింపు కేసులో పట్నా హైకోర్టు సీరియస్ అయ్యింది. బాధితులకు అందజేసిన పరిహారం వివరాలను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధితుల జాబితా తదితర వివరాలకు సవిరంగా అందించాలని కోరింది. వెటరన్ ఫోరమ్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన పట్నా హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఈ ఏడాది సెప్టెంబరు 1కు వాయిదా వేసింది.
మహిళల గర్భాశయాల తొలగింపు కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదని ధర్మాసనానికి పిటిషనర్ తరఫు న్యాయవాది దిను కుమార్ తెలిపారు. ఈ కేసుపై గతంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించిందని పేర్కొన్నారు. 40 ఏళ్ల లోపు బాధిత మహిళలకు రూ.2 లక్షలు, ఆ వయసుపైబడినవారికి రూ.1.25 లక్షలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు కోర్టుకు తెలిపారు. అయినా.. ఎంతమంది బాధితులకు పరిహారం అందించారో ప్రభుత్వ రికార్డులో పొందుపరచలేదని పేర్కొన్నారు.
2017లో పట్నా హైకోర్టులో వెటరన్ ఫోరం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. అందులో జాతీయ ఆరోగ్య బీమా పథకాన్ని(నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్) దుర్వినియోగపరుస్తూ బిహార్‌లోని పలు ఆస్పత్రులు, వైద్యులు మహిళల అనుమతి లేకుండానే వారికి గర్భాశయాలను తొలగించే ఆపరేషన్ నిర్వహించారని పేర్కొంది.
అసలేంటి ఈ స్కామ్..
జాతీయ ఆరోగ్య బీమా పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబానికి రూ.30,000 వరకు ఉచిత వైద్యం అందుతుంది. అందుకోసం బిహార్‌లో 350 ఆస్పత్రులను ఎంపిక చేశారు అధికారులు. ఆ తర్వాత ఈ ఆస్పత్రులకు వైద్యం కోసం వచ్చిన దాదాపు 27 వేల మంది మహిళలకు వారికి తెలియకుండానే గర్భాశయాలను తొలగించారు. ఈ ఘటనను బిహార్ మానవ హక్కుల కమిషన్ 2012 ఆగష్టు 30న ఈ వార్తను సుమోటోగా స్వీకరించింది.
కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళకు షాక్..
ఈ ఏడాది జులైలో కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్తే.. ఏకంగా మహిళ గర్భాశయాన్ని తొలగించాడు ఓ వైద్యుడు. పిత్తాశయంలో రాళ్లకు బదులుగా గర్భసంచిని తీసేశాడు. విషయం తెలిసి డాక్టర్‌ను గట్టిగా నిలదీస్తే.. చంపేస్తానని బాధితులను బెదిరించాడు. పోలీసులు కూడా ఈ విషయంలో ఏం చేయలేకపోయారు. దీంతో కోర్టును ఆశ్రయించింది సదరు మహిళ. బాధితురాలి ఆభ్యర్తనను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. మూడేళ్ల తరువాత ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఈ ఘటన జరిగింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
బిహార్‌లో కుల గణనకు మార్గం సుగమం.. ఆ పిటిషన్లను తిరస్కరించిన హైకోర్టు
60 ఏళ్ల వృద్ధుడి కడుపులో గర్భాశయం.. రిపోర్ట్స్ చూసి డాక్టర్లు షాక్..!