ETV Bharat / bharat

క్యాబ్​ డ్రైవర్​ను హత్యచేసిన మైనర్లు.. 32సార్లు కత్తితో పొడిచి.. - బిహర్​ న్యూస్​

Bihar Juveniles Arrested: డబ్బు కోసం హత్య చేసిన ఇద్దరు మైనర్లని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.2,100 నగదు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

Bihar Juveniles Arrested
Bihar Juveniles Arrested
author img

By

Published : Apr 29, 2022, 1:04 PM IST

Bihar Juveniles Arrested: క్యాబ్​ డ్రైవర్​ను హత్యచేసిన ఇద్దరు బాలురను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా.. రైలులో నిందితుల్ని పట్టుకున్నారు పోలీసులు. ఘటన జరిగిన 58 గంటల్లోనే కేసును ఛేదించారు. డబ్బు కోసమే నిందితులు హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల వద్ద నుంచి రూ.2,100 నగదు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. క్యాబ్​ డ్రైవర్​ను 32 సార్లు కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

బిహర్​కు చెందిన 16, 17 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురు.. పదో తరగతిలోనే చదవు ఆపేశారు. దొంగతనాలు చేయడానికి బెంగళూరు వచ్చారు. ఏప్రిల్​ 16న బొమ్మనహల్లికి చేరుకున్న నిందితులు.. దిలీప్​ అనే క్యాబ్​ డ్రైవర్​ను ఆశ్రయించారు. కారు ప్రయాణించాలంటే.. రైడ్​ యాప్​లో బుక్​ చేయాలని దిలీప్​ చెప్పగా.. తాము అత్యవసర పరిస్థితిలో ఉన్నామని నమ్మబలికారు. ఈ క్రమంలో కారు ఎక్కి.. అయ్యప్ప స్వామి గడి దగ్గరకు తీసుకువెళ్లి దిలీప్​ను బెదిరించి.. 32 సార్లు కత్తితో పొడిచారు. అనంతరం అతని వద్ద నుంచి రూ.12,000 నగదు దోచుకుని పారిపోయారు. హత్య తర్వాత గ్రామానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్న నిందితులు.. యశ్వంత్‌పూర్‌లో నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి బయలుదేరారు. విచారణ చేపట్టిన పోలీసులు.. రైలులో ప్రయాణిస్తున్న నిందితులను పట్టుకున్నారు.​

ఇదీ చదవండి: భర్తను చెప్పుతో కొట్టింది.. కాపురాన్ని చేతులారా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.