ETV Bharat / bharat

ముక్కుతో టైపింగ్​ చేసి గిన్నిస్ రికార్డుల్లోకి.. - delhi man nose typing

దిల్లీకి చెందిన వినోద్ చౌదరి చేతులతో పాటు ముక్కుతో అత్యంత వేగంగా టైప్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. అయితే వినోద్ గిన్నిస్​ రికార్డులో చోటు సంపాదించుకోవటం ఇదే మొదటిసారి కాదు. ఇలా 8 సార్లు వివిధ రకాలుగా కొత్త రికార్డులు సృష్టించారు.

Vinod Choudhary
వినోద్ చౌదరి
author img

By

Published : Jul 2, 2020, 1:00 PM IST

Updated : Jul 2, 2020, 2:30 PM IST

సాధారణంగా కీబోర్డుపై చేతి వేళ్లతో టైప్ చేస్తాం. కొంతమంది పాదాలతో టైప్ చేయటమూ అప్పుడప్పుడూ చూస్తుంటాం. కానీ ముక్కుతో టైప్ చేసే వారిని మీరు ఎప్పుడైనా చూశారా? అది కూడా వేగంగా... మరి ఇంకెందుకు పదండి ఆయన్ను కలిసొద్దాం..

దిల్లీ ప్రేమ్ నగర్ నివాసి వినోద్ చౌదరి. 19 ఏళ్లుగా టైపింగ్ అనుభవం ఉన్న ఈ వ్యక్తి ముక్కుతో టైప్ చేయటంలో దిట్ట. అంతేకాదు ఒకే చేతితో టైప్​ చేయటంలోనూ నేర్పరి. అందుకే ఒకసారి కాదు.. 8 సార్లు గిన్నిస్ బుక్​లో చోటు సంపాదించారు.

ముక్కుతో టైపింగ్​ చేసి గిన్నిస్ రికార్డుల్లోకి..

15 ఏళ్లలో 8 రికార్డులు..

మొదటిసారిగా 2014లో ముక్కుతో వేగంగా టైప్ చేసిన రికార్డును సాధించారు. గిన్నీస్​ బుక్​ వారు ప్రతిపాదించిన నిర్దేశిత అక్షరాలకు వినోద్ తీసుకున్న సమయం 46.30 సెకన్లు.

Vinod Choudhary
వినోద్ చౌదరి
  • ఆ తర్వాత 2016లో ఒక చేతితో 6.9 సెకన్లు, అదే ఏడాది కళ్లు మూసుకుని 6.71 సెకన్లు వేగవంతమైన టైపింగ్ రికార్డు సాధించారు.
  • 2017 నోటితో పెన్ను పట్టుకుని 18.65 సెకన్లలో టైప్ చేసి మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు.
  • 2018లో 17.69 సెకన్లతో ఈ రికార్డును బ్రేక్ చేశారు.
  • 2019లో 21.69 సెకన్లలో ఒక వేలితో వేగంగా టైప్​ చేసిన రికార్డు కైవసం చేసుకున్నారు వినోద్.
    Vinod Choudhary
    ముక్కుతో టైప్ చేస్తూ..

సైన్యంలో చేరాలనుకున్నా..

వినోద్​కు సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని ఉండేది. కానీ ఎత్తు తక్కువగా ఉండటం వల్ల సాధ్యపడలేదట. ప్రస్తుతం వినోద్ చౌదరి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ పర్యావరణ సంస్థలో పనిచేస్తున్నారు.

ఇదీ చూడండి: అన్నార్తులకు ఆసరాగా 'గరీబ్ కల్యాణ్'

Last Updated : Jul 2, 2020, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.