ETV Bharat / bharat

గెలుపు కోసం 'కొబ్బరికాయ' కొట్టిన కమల!​ - కమలా హ్యారిస్​

అమెరికా ఉపాధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న తొలి ఇండో-అమెరికన్​ కమలా హ్యారిస్​.. తన భారత మూలాలను ఎప్పుడూ మరచిపోలేదని చాటిచెప్పే విధంగా న్యూయర్క్​ టైమ్స్​ ఓ కథను ప్రచురించింది. కాలిఫోర్నియా అటార్నీ జనరల్​ పదవికి పోటీ పడుతున్న సమయంలో.. చెన్నైలోని తన అత్తకు ఫోన్​ చేసిన హ్యారిస్​.. తన గెలుపు కోసం ఆలయంలో కొబ్బరికాయ కొట్టి ప్రార్థించమని కోరినట్టు పేర్కొంది.

When Kamala Harris asked aunt in India to break coconuts for her good luck at Hindu temple
గెలుపు కోసం' కొబ్బరికాయ' కొట్టిన కమలా హ్యారిస్!​
author img

By

Published : Aug 17, 2020, 4:10 PM IST

Updated : Aug 17, 2020, 4:30 PM IST

అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీలో నిలిచిన తొలి ఇండో-అమెరికన్​గా చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్.. ఇప్పుడొక హాట్​ టాపిక్​. దీనికి తోడు భారత దేశంతో ఆమెకున్న బంధం గురించి రోజుకో విషయం బయటకు వస్తుండటం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. తాజాగా.. తన గెలుపు కోసం తన అత్తను చెన్నైలోని ఓ ఆలయంలో కొబ్బరికాయ కొట్టి ప్రార్థించమని హ్యారిస్​ కోరినట్టు న్యూయార్క్​ టైమ్స్​ రాసుకొచ్చింది.

చెన్నైలోని ఆలయంలో...

'కమలా హ్యారిస్​ విలువలను ఆమె కుటుంబం ఎలా తీర్చిదిద్దింది' అనే కథనాన్ని న్యూయార్క్​ టైమ్స్​ ప్రచురించింది. దీని ప్రకారం.. 2010 కాలిఫోర్నియా అటార్నీ జనరల్​ ఎన్నికల్లో పోటీ పడ్డ సమయంలో చెన్నైలోని తన అత్త సరళా గోపాలన్​కు ఫోన్​ చేశారు. బేసంత్​నగర్​లోని ఆలయానికి వెళ్లి కొబ్బరి కాయ కొట్టి తన గెలుపు కోసం ప్రార్థించమని అత్తను కోరారు హ్యారిస్​.

ఇదీ చూడండి:- భారత్​ అంటే 'ఇడ్లీ లాంటి కమ్మని ప్రేమ': కమలా

ఈ నేపథ్యంలో ఆలయానికి వెళ్లిన సరళ.. కమల గెలుపు కోసం 108 కొబ్బరి కాయలు కొట్టారు. ఇదే విషయాన్ని 2018లో ఓ భారతీయ సంఘం నిర్వహించిన వేడుకలో హ్యారిస్​ ప్రస్తావించారు. ఆ ఎన్నికల్లో 0.8శాతం తేడాతో కమలా గెలుపొందారు.

ఈ సందర్భంగా.. తన తాతతో ఆ ఆలయంలో కలిసి నడిచిన రోజులను గుర్తుచేసుకున్నారు హ్యారిస్​. తన చిన్నతనంలో భారత్​ పర్యటనకు వచ్చినప్పుడు.. తన తాతతో కలిసి బీచ్​లో తిరిగిన రోజులు ఇంకా గుర్తున్నాయని వెల్లడించారు. తనను ఈ స్థాయిలో నిలబెట్టడంలో కుటుంబసభ్యులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:-

Last Updated : Aug 17, 2020, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.