ETV Bharat / bharat

అసలు ఏమిటీ తబ్లీగీ జమాత్‌? వీటి లక్ష్యాలేంటి? - what is this attitude, he is your lord praise him

దిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో గత నెలలో జరిగిన మతపరమైన కార్యక్రమం నిర్వహించిన సంస్థ తబ్లీగీ జమాత్. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ ఈ సంస్థ చుట్టునే సాగుతోంది. కార్యక్రమంలో పాల్గొన్న రెండు వేల మందికి పైగా ప్రతినిధుల్లో కొందరికి కరోనా సోకడమే ఈ చర్చకు కారణం. అయితే ఈ తబ్లీగీ జమాత్ అంటే ఏంటి? దాని లక్ష్యాలేంటి? అనే విషయాలు చూద్దాం!

shia
ఏమిటీ తబ్లిగి జమాత్‌?
author img

By

Published : Apr 1, 2020, 7:00 AM IST

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా 'తబ్లీగీ జమాత్‌' గురించే చర్చ. దిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో ఈ సంస్థ గత నెలలో నిర్వహించిన మతపరమైన కార్యక్రమంలో రెండు వేల మందికి పైగా పాల్గొనడం.. అందులోని పలువురిలో కొవిడ్‌-19 లక్షణాలు బయటపడటం కలకలం సృష్టించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయుల్లో చాలామంది ఇప్పటికే తమ స్వరాష్ట్రాలకు వెళ్లడం.. వారిలో కొందరు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు 'తబ్లీగీ జమాత్‌' అంటే ఏంటి? దాన్ని ఎప్పుడు, ఎవరు ప్రారంభించారు? సంస్థ స్థాపన వెనుక లక్ష్యాలేంటి? అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం.

అల్లా మాటలను బోధించేవారిని 'తబ్లీగీ'గా పిలుస్తారు. 'జమాత్‌' అంటే సంస్థ. 'తబ్లీగీ జమాత్‌' అంటే అల్లా మాటలను బోధించే సంస్థ. సమావేశ స్థలాన్ని మర్కజ్‌గా పేర్కొంటారు.

ఏటా భారీయెత్తున కార్యక్రమాలు

తబ్లీగీ జమాత్‌ భారత్‌లోని పలు ప్రాంతాల్లో భారీయెత్తున మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. ఏటా భోపాల్‌లో నిర్వహించే కార్యక్రమానికి లక్షల మంది హాజరవుతుంటారు. దిల్లీ, మహారాష్ట్రల్లోనూ ఈ సంస్థ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాలు జరుగుతుంటాయి. దేశ విదేశాల నుంచి పలువురు హాజరయ్యేందుకు వీలుగా వాటి షెడ్యూలును దాదాపు ఏడాది ముందుగానే ఖరారు చేస్తుంటారు. నిజాముద్దీన్‌ మర్కజ్‌లో గత నెలలో నిర్వహించిన ప్రార్థనలకు భారత్‌లోని పలు రాష్ట్రాలతోపాటు ఇండోనేసియా, మలేసియా తదితర దేశాల నుంచి కూడా పలువురు తరలి వచ్చారు.

ఆరోపణల మకిలి!

తబ్లీగీ జమాత్‌పై 2011లో 'వికిలీక్స్‌' సంచలన ఆరోపణలు చేసింది. కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో దీనికి సంబంధాలున్నాయని ఆరోపించింది. ఉగ్రవాదులకు డబ్బు, వీసాలు దాని ద్వారా అందుతున్నాయని పేర్కొంది. వీటిని జమాత్‌ ప్రతినిధులు ఖండించారు. 2016లో అల్‌ఖైదాకు చెందిన ఓ ఉగ్రవాదిని దిల్లీ పోలీసులు హరియాణాలోని మేవాట్‌లో అరెస్టు చేశారు. అతడికి జమాత్‌తో సంబంధాలున్నట్లు వార్తలొచ్చాయి. హరియాణాలోని పల్వాల్‌లో తబ్లీగీ జమాత్‌ సంస్థ మసీదు నిర్మాణాన్ని ప్రారంభించినప్పుడు కలకలం చెలరేగింది. పాక్‌ ఉగ్ర సంస్థ జవాత్‌-ఉద్‌-దవా అధినేత హఫిజ్‌ సయీద్‌తో సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి నుంచి సేకరించిన నిధులతో ఆ నిర్మాణం ప్రారంభమైందని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఆరోపించింది.

ఇదీ చదవండి: దిల్లీ నుంచి గల్లీ దాకా నిజాముద్దీన్​ కల్లోలం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.