ETV Bharat / bharat

'తీర్పును గౌరవిస్తున్నాం- అంతా సామరస్యంగా ఉండాలి' - అయోధ్య కేసులో సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం..

అతి సున్నితమైన అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ తీర్మానం చేసింది. ఈ మేరకు అన్ని పార్టీలు, పక్షాలు శాంతి, సామరస్యాలతో మెలగాలని పేర్కొంది.

అయోధ్య కేసులో సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం..
author img

By

Published : Nov 9, 2019, 2:15 PM IST

అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. తీర్పును స్వాగతిస్తూ ఈ మేరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలమేనన్న కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు, వర్గాలు శాంతి, సామరస్యాలతో మెలగాలని కోరింది.

అయోధ్య కేసులో సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: కాంగ్రెస్

"అయోధ్య కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారత జాతీయ కాంగ్రెస్ స్వాగతిస్తోంది. రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక విలువలు, సోదరభావాలకు కట్టుబడి ఉండాలని, శాంతి, సామరస్యాలను కొనసాగించాలని సంబంధిత పక్షాలను, వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. యుగయుగాలుగా మన సమాజం నిర్వచిస్తోన్న పరస్పర గౌరవం, ఐక్యతలను పునరుద్ఘాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ అనుకూలమే."
- రణ్‌దీప్‌ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

ఇదీ చూడండి:'దేశభక్తిని బలోపేతం చేయాల్సిన సమయం ఇది'

New Delhi, Nov 09 (ANI): Supreme Court ordered Central Government to formulate scheme for setting up a trust within 3-4 months over the disputed site for construction of temple. A suitable alternative plot of land measuring 5 acres at Ayodhya will be given to Sunni Waqf Board according to the order.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.