ETV Bharat / bharat

శ్వేతవర్ణంలో కొండచిలువ.. ఎప్పుడైనా చూశారా? - తెలుపు రంగు కొండచిలువ

అరుదైన కొండచిలువ కర్ణాటకలోని ఓ ఇంట్లో దర్శనమిచ్చింది. దాన్ని చూసి ఆందోళనకు గురైన ఇంటి సభ్యులు.. పాములను పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. అతను ఆ కొండచిలువను చాకచక్యంగా పట్టకొని అటవీ అధికారులకు అప్పగించాడు.

WATCH: White python spotted in Karnataka's Malenadu
కర్ణాటకలో దర్శనమిచ్చిన అరుదైన కొండచిలువ
author img

By

Published : Jun 5, 2020, 5:26 PM IST

కర్ణాటక మలేనాడు ప్రాంతంలో కవలకట్టే గ్రామంలోని ఓ ఇంట్లో అరుదైన తెలుపు వర్ణం కొండచిలువ కనిపించింది. శాస్త్రీయంగా దీనిని 'ఆల్బినో పైతాన్​' అని పిలుస్తారు. రుతపవనాల ఆరంభం కావడం వల్ల సరిసృపాలు, కీటకాలు సురక్షితమైన స్థలం కోసం వెతుకుతుంటాయి.

ఈ క్రమంలోనే దక్షిణ కన్నడ జిల్లా బంట్వాలా తాలూకాలో నౌసాద్​ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించింది అరుదైన ఈ శ్వేతజాతి కొండచిలువ. దీంతో భయపడిన కుటుంబ సభ్యులు స్థానికంగా పాములు పట్టే కిరణ్​కు సమాచారం అందించారు. అతను పామును పట్టుకొని... అటవీ అధికారులకు అప్పగించాడు. దానిని మంగళూరులోని పిలికుల జంతు ప్రదర్శనశాలకు తరలించారు అధికారులు.

కర్ణాటకలో దర్శనమిచ్చిన అరుదైన కొండచిలువ

ఇదీ చూడండి: '15 రోజుల్లోగా వలస కూలీలను స్వరాష్ట్రాలకు చేర్చాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.