ETV Bharat / bharat

కన్నబిడ్డను తాకలేక తల్లడిల్లిన​ తల్లి! - mother daughter news

కర్ణాటకలో కరోనా క్వారంటైన్​లో ఉన్న తల్లి​ని దూరం నుంచి కలిసింది మూడేళ్ల చిన్నారి. ఆసుపత్రిలో నర్స్​గా సేవలందించిన అమ్మను తనకు దూరంగా ఎందుకు ఉంచుతున్నారో తెలీక.. అమ్మా.. అమ్మా అంటూ గుండెలు పగిలేలా ఏడ్చిన దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.

Quarantined Nurse Meets her 3 year Old Daughter From a Distance
కన్నబిడ్డను తాకలేక.. తల్లడిల్లిన​ తల్లి!
author img

By

Published : Apr 8, 2020, 11:47 PM IST

"అమ్మా.. నువ్వు ఇంటికి రావట్లేదని నేనే నీ దగ్గరకు వచ్చేశాను. ఇప్పుడు కూడా నాకు నువ్వు దూరంగా ఎందుకున్నావు. ఇంటికి ఎప్పుడొస్తావు. అమ్మా ఒక్క సారి నన్ను ఎత్తుకో.." అని చెప్పకపోయినా కరోనా క్వారంటైన్​లో ఉన్న తన తల్లిని.. దూరం నుంచి కలిసిన ఆ మూడేళ్ల చిన్నారి ఏడుపుకు అర్థం అదే!

కన్నబిడ్డను తాకలేక తల్లడిల్లిన​ తల్లి!

తల్లడిల్లిన తల్లీబిడ్డలు..

కరోనా మహమ్మారి నుంచి మనల్ని కాపాడేందుకు వారి కుటుంబాన్ని వదిలి సేవలందిస్తున్నారు వైద్య సిబ్బంది. అలాంటి వైద్యరంగంలో నర్స్​గా విధులు నిర్వహిస్తోంది కర్ణాటక బెళగావి హలగాకు చెందిన సునంద. ఎందరో రోగులకు నిత్యం సేవలందించే సునందకు కరోనా సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి, డ్యూటీ తర్వాత 14 రోజుల పాటు ఓ హోటల్​ గదిలో నిర్బంధంలో ఉంచారు వైద్యులు.

సునంద కూతురు ఐశ్వర్య అమ్మను చూడాలని మారాం చేసింది. నాన్న సంతోష్​తో కలిసి తల్లి ఉన్న హోటల్​కి వచ్చింది.​ తల్లిని చూసి పరిగెత్తుకెళ్లి కౌగలించుకోవాలనుకుంది. కానీ, నాన్న బండి దిగనివ్వట్లేదు. 'అమ్మా, అమ్మా..' అంటూ ఏడుస్తూనే ఉంది ఐశ్వర్య.

బిడ్డ ఆవేదన చూసి సునంద తల్లడిల్లిపోయింది. కన్న బిడ్డను తాకలేని దుస్థితిని మూడేళ్ల చిన్నారికి ఎలా వివరించాలో తెలీక కన్నీటి పర్యంతమైంది.

సీఎం ఫోన్​...

సునంద, ఐశ్వర్యల వీడియోపై స్పందించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్​ యడియూరప్ప. సునందకు ఫోన్​ చేసి ఆమె చేస్తోన్న సేవలను మెచ్చుకున్నారు.

"కన్నబిడ్డకు దూరంగా ఉంటూ మీరు సేవలందిస్తున్నారు. టీవీలో నేను ఆ వీడియో చూశాను. మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలున్నాయి. మీ కష్టపడేతత్వమే మిమ్మల్ని కాపాడుతుంది."

-బీఎస్​ యడియూరప్ప, కర్ణాటక సీఎం

ఇదీ చదవండి:కరోనా ఉన్మాదం: బాధితుల మూత్రం సీసాలు విసిరి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.