ETV Bharat / bharat

'పారాసెటమాల్​తోనే కరోనాకు చికిత్స!'

ప్రపంచవ్యాప్తంగా 113,000 మందికి కరోనా సోకింది, 4 వేల మందిని బలిగొందని బెంబేలెత్తిపోతున్నామే గానీ... 64 వేలమంది కరోనాను జయించారనే సంగతి విస్మరిస్తున్నాం. మరి వారంతా కరోనాను ఎలా జయించారు..? వైరస్​ వ్యాప్తికి అడ్డుకట్టవేసే మార్గాలేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనంలో చూసేద్దాం రండి...

author img

By

Published : Mar 12, 2020, 4:19 PM IST

Updated : Apr 7, 2020, 2:51 PM IST

Slug Wash your hands frequently, no need to worry about Coronavirus: Dr Usha M Kumar
'పారాసెటమాల్​తోనే కరోనాకు చికిత్స!'
'పారాసెటమాల్​తోనే కరోనాకు చికిత్స!'

"కరోనా కాటేస్తోంది.. వైరస్​ వేటేస్తోంది.. కోవిడ్​19 వస్తే అంతే సంగతులు.. " అని సామాజిక మాధ్యమాల్లో జోరుగా అసత్య ప్రచారం జరుగుతోంది. కరోనా​ వేగంగా వ్యాపిస్తుందన్న సంగతి వాస్తవమే అయినా.. అది ఓ వైరస్​ మాత్రమే. మానవ సంకల్పం ముందు ఎంతటి కరోనా అయినా మట్టికరవాల్సిందే. కేవలం కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల.. కరోనా దరి చేరదని స్పష్టం చేస్తున్నారు వైద్యులు.

కరోనాపై ప్రజల్లో పెరిగిన అనవసర భయాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈటీవీ భారత్​ దిల్లీకి చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్​ ఉషా ఎం కుమార్​ను కలిసింది. పదే పదే చేతులు కడగడం వల్ల కరోనాను తరిమికొట్టొచ్చని ఆమె తెలిపారు.

"కరోనా వైరస్​ కూడా మిగతా సాధారణ వైరస్​లు లాంటిదే. ఇది సోకితే జలుబు, దగ్గు, గొంతు సమస్యలు, తుమ్ములు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ ఓ ఐదుగురికి కరోనా సోకితే.. అందులో నలుగురికి సాధారణ పారాసెటమాల్​ మాత్రలతోనే తగ్గిపోతుంది. ఎవరో ఒకరికి మాత్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వారు వైద్యులను సంప్రదించాలి. కేవలం మాస్క్​ మాత్రమే వైరస్ నుంచి రక్షణ కల్పించలేదు. ఆల్కహాల్​ బేస్డ్​ శానిటైజర్​​తో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ శానిటైజర్​ లేకపోతే.. సబ్బుతో గంటకోసారి చేతులు కడుక్కోవాలి."

-డాక్టర్​ ఉషా ఎం కుమార్​

మాస్క్ ఎవరు వేసుకోవాలి?

కరోనా లక్షణాలు కనిపించినవారు మాత్రమే మాస్కులు ధరిస్తే చాలంటున్నారు వైద్యులు. వైరస్​ సోకినవారు ముఖానికి మాస్క్​ అడ్డుగా పెట్టకోవడం వల్ల వారి శరీరం నుంచి వైరస్​ మరొకరికి వ్యాపించదు.

ఎవరికి త్వరగా సోకుతుంది?

​వృద్ధులు, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు, గర్భిణీలు,సరిగ్గా ఆహారం తీసుకోని బాలల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వీరికి ఏ వైరస్​ అయినా త్వరగా సంక్రమించే ప్రమాదం ఉంటుంది కాబట్టి అలాంటివారు మాస్కులు ధరించాలి. ఎవరితోనైనా మాట్లడేటప్పుడు కనీసం ఒక మీటర్​ దూరం పాటిస్తే మంచిది.

ఏం తింటే మంచిది?

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించే తాజా పళ్లు, ఆకుపచ్చ రంగులోని కూరగాయలు, డ్రైఫ్రూట్లు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా వైరస్​ శరీరంలోకి ప్రవేశించినా... సాధారణ వైద్యంతో కరోనాను తరిమికొట్టవచ్చు.

ఇదీ చదవండి:ఏనుగుని కాల్చాడు.. ఉద్యోగం పోగొట్టుకున్నాడు!

Last Updated : Apr 7, 2020, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.