భారత్లో కొవిడ్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు మహారాష్ట్ర, తమిళనాడులో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కాగా.. తాజాగా ఉత్తర్ప్రదేశ్లోనూ రోజుకు 4 వేల కొత్త కేసులు బయటపడుతున్నాయి.
ఉత్తర్ప్రదేశ్లో ఉగ్రరూపం..
ఉత్తర్ప్రదేశ్లో రికార్డు స్థాయిలో వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజే 4,658 మందికి వైరస్ సోకింది. మరో 64 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య లక్ష దాటింది. మృతుల సంఖ్య 1,918కు పెరిగింది.
దిల్లీ..
దిల్లీలో తాజాగా 1,299 మంది వైరస్ బారినపడ్డారు. మరో 15 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసులు సంఖ్య 1,41,531కు చేరింది. మరణాల సంఖ్య 4,059కు పెరిగింది.
రోజూ వెయ్యికిపైనే..
కేరళలో రోజూ వెయ్యికిపైనే కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా 1,298మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 97కు ఎగబాకింది.
ఇదీ చూడండి: 'కరోనా రోగులపై పని చేయని ప్లాస్మా చికిత్స'