ETV Bharat / bharat

భార్య తల నరికి పోలీస్ స్టేషన్​కు పట్టుకెళ్లిన భర్త - man chopped his wife's head UP BANDA Chinnar Yadav

అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తన భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. చివరకు ఆమె తల నరికి పోలీసు స్టేషన్​లో లొంగిపోయాడు. తలను చేతిలో పట్టుకొని వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

uttar pradesh man beheads wife carries head to police station
అనుమానంతో భార్య తలను తెగనరికిన భర్త
author img

By

Published : Oct 9, 2020, 2:37 PM IST

అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేశాడు చిన్నార్ యాదవ్ అనే కిరాతకుడు. శిరచ్ఛేదం చేసి తలను పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లి లొంగిపోయాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని బాందాలో ఈ ఘటన జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం నిందితుడు చిన్నార్ యాదవ్.. స్థానిక నేతా నగర్​లో తన భార్య(35)తో కలిసి నివాసం ఉంటున్నాడు. ఉదయం 7.30 గంటలకు ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. తగువులాట తీవ్రం కావడం వల్ల కోపంతో పదునైన ఆయుధంతో భార్య తలను తెగనరికేశాడు. తలను బాబెరూ పోలీస్ స్టేషన్​కు తీసుకొచ్చి లొంగిపోయాడు.

uttar pradesh man beheads wife carries head to police station
అనుమానంతో భార్య తలను తెగనరికిన భర్త

తన భార్య తలను పట్టుకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిందని పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి- చెప్పుకోలేక.. ఆపుకోలేక ఇబ్బంది పడుతున్నారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.