ETV Bharat / bharat

వాడేసిన మాస్కులను ఉతికి, రీసేల్​కు యత్నం - మహారాష్ట్ర

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం మాస్కుల నిబంధన తప్పనిసరి చేసింది. దీన్ని ఆసరాగా చేసుకున్న మహారాష్ట్రలోని ముగ్గురు వ్యక్తులు.. వాడిపారేసిన మాస్కులను మళ్లీ విక్రయించేందుకు సిద్ధమయ్యారు. చివరకు... అడ్డంగా దొరికిపోయి జైలు పాలయ్యారు.

అక్రమ మాస్కుల నిర్వహణలో అడ్డంగా బుక్కయ్యారిలా
author img

By

Published : Apr 14, 2020, 8:38 PM IST

మహారాష్ట్రలో అక్రమంగా మాస్కులను నిల్వ చేస్తున్నారనే ఆరోపణతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పాల్​ఘడ్​ జిల్లాలోని వసై పట్టణంలో ఈ ముగ్గురూ సుమారు రూ. 50 లక్షల విలువైన ఎన్‌-95 మాస్కులను దాచారని పోలీసులు తెలిపారు.

వాడి పారేసిన మాస్కులను అలా..

సుమారు 25 వేల మంది ఉపయోగించిన రూ.51.34 లక్షలు విలువైన మాస్కులను విరార్‌ గడ్గపాడ ప్రాంతంలోని ఓ ఇంట్లో స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక క్రైమ్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ సిద్ధవా జైభాయ్‌ చెప్పారు. వాడి పారేసిన మాస్కులను ఉతికి, ఇస్త్రీ చేసి బాక్సుల్లో ప్యాక్‌ చేసి మళ్లీ అమ్మకానికి పంపుతున్నారని తెలిపారు.

ఈ కేసులో నాగరాజ్‌ పిళ్ల(33), రోహిత్ కొఠారి(30), మహమ్మద్‌ నిగార్‌ షేఖ్(28)లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు సిద్ధవా. వీరిపై సెక్షన్‌-420(మోసం), సెక్షన్​-270, ఐపీసీ.. నిత్యావసర వస్తు ఉత్పత్తుల చట్టం, అంటువ్యాధుల చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఆమె వెల్లడించారు.

ఇదీ చదవండి: భాజపా ఐకమత్యం.. ట్విట్టర్​లో మాస్కులతో దర్శనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.