మహిళతో అసభ్యంగా ప్రవర్తించటమే కాక అడ్డొచ్చిన వ్యక్తిని తుపాకీతో కాల్చిన ఓ పోలీస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లా కమల్పుర్లో జరిగింది.
కమల్పుర్లో వివాహ వేడుకకు వెళ్తున్న ఓ మహిళతో సర్వేశ్ అనే పోలీస్ అధికారి, తన స్నేహితులతో కలిసి మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డుకోబోయిన కిషన్‌లాల్ అనే వ్యక్తిని తుపాకీతో కాల్చాడు. గాయపడిన కిషన్‌లాల్ ప్రస్తుతం వారణాసిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో సర్వేశ్తోపాటు అతడి స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: స్కార్పియో- లారీ ఢీ- 8మంది మృతి