ETV Bharat / bharat

నమస్తే ట్రంప్: ఆతిథ్యానికి సర్వం సిద్ధం- భద్రత కట్టుదిట్టం - trump visit to india

అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కోసం భారత్​​ వేయికళ్లతో వేచి చూస్తోంది. ఘన స్వాగతం పలికేందుకు సర్వాంగ సుందరంగా తయారైంది. రోడ్​ షో, నమస్తే ట్రంప్​ కార్యక్రమానికి ఊహించని రీతిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్​ఎస్​జీ, ఎస్​పీజీ సహా యూఎస్​ సీక్రెట్​ సర్వీస్​ నేతృత్వంలో భద్రత కట్టుదిట్టంగా ఉంది.

security measures in place in Delhi, Ahmadabad
security measures in place in Delhi
author img

By

Published : Feb 23, 2020, 4:54 PM IST

Updated : Mar 2, 2020, 7:34 AM IST

నమస్తే ట్రంప్: ఆతిథ్యానికి సర్వం సిద్ధం- భద్రత కట్టుదిట్టం

'నమస్తే ట్రంప్'... భారత్​, అమెరికాను మాత్రమే కాదు ప్రస్తుతం యావత్​ ప్రపంచాన్నే ఈ పదం ఊపేస్తోంది. భారత్​ ఆతిథ్యాన్ని తొలిసారి కళ్లారా చూసేందుకు.. తనివితీరా అనుభవించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సోమవారం రానున్నారు. అగ్రరాజ్యాధిపతికి ఘన స్వాగతం పలికేందుకు భారత్​ సిద్ధమైంది.

flags
భారత్​-అమెరికా జెండాలు

అమిత్​ షా సమీక్ష...

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అహ్మదాబాద్​ చేరుకున్నారు. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.

flags
అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

భద్రతా నీడలో...

విమానాశ్రయం నుంచి డొనాల్డ్​ ట్రంప్​, మెలానియా వచ్చే మార్గంలో 100 వాహనాలతో ఫైనల్​ రిహార్సల్​ను అధికారులు పూర్తి చేశారు.

'నమస్తే ట్రంప్'​ కార్యక్రమానికి వేదికైన మోటేరా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు, భద్రతా దళాలు సమీక్ష నిర్వహిస్తున్నాయి.

flags
పోలీసుల భద్రత
  • 25 మంది ఐపీఎస్​ అధికారుల నేతృత్వంలోని 10 వేల మంది భద్రతా దళాలను రోడ్​ షో, నమస్తే ట్రంప్​ కార్యక్రమానికి మోహరించారు.
  • యూఎస్​ సీక్రెట్​ సర్వీస్​, జాతీయ భద్రతా దళాలు, ప్రత్యేక భద్రతా దళం నీడలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
  • ట్రంప్​ వచ్చే మార్గంలో యాంటీ డ్రోన్​ సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఈ మార్గంలో ఎన్​ఎస్​జీకి చెందిన యాంటీ స్నైపర్​ బృందం ట్రంప్ వాహనశ్రేణితో పాటు ఉండనుంది.
  • ట్రంప్​ రాకకు ముందే అమెరికా వాయుసేనకు చెందిన నాలుగు సీ17 కార్గో విమానాలు భద్రత, సమాచార పరికరాలతో అహ్మదాబాద్​కు చేరుకున్నాయి.
  • ఇందులో ట్రంప్​ అధికారిక విమానం మెరైన్​ వన్​, బీస్ట్​ వాహనం కూడా ఉన్నాయి.

హస్తినలోనూ కట్టుదిట్టం...

  • ఎన్నడూ లేని విధంగా అమెరికా-ఇరాన్​ మధ్య ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో ట్రంప్​ భద్రతపై బలగాలన్నీ హైఅలర్ట్​లో ఉన్నాయి.
  • దిల్లీలో ట్రంప్​కు ఆతిథ్యమిచ్చే ఐటీసీ మౌర్య హోటల్​ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.
  • సైన్యం, పారామిలిటరీ సభ్యులతో కూడిన రక్షణ బృందాలు ట్రంప్​ ప్రయాణిచ్చే మార్గాల్లో భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.
  • యూఎస్​ సీక్రెట్​ సర్వీస్​ ఏజెంట్లకు భారత భద్రతా దళాలు సహకరిస్తున్నాయి.
  • ఎన్​ఎస్​జీకి చెందిన యాంటీ డ్రోన్, స్నిపర్​ బృందాలు, స్వాట్​ కమాండోలు, జాగిలాల బృందం, పరాక్రం వాహనాలను హోటల్​కు దగ్గరున్న వివిధ ప్రాంతాల్లో మోహరించారు.
  • రాత్రి వేళ కూడా పనిచేసే 100కు పైగా హై డెఫినిషన్​ సీసీటీవీ కెమెరాలను సర్దార్​ మార్గం నుంచి మౌర్య హోటల్​కు వెళ్లే మార్గంలో ఏర్పాటు చేశారు.
  • బలగాలకు దిల్లీ పోలీసులు పూర్తి సహకారమిస్తున్నారు. ట్రంప్​ వాహనశ్రేణి వెళ్లే మార్గాల్లో డబుల్ బారికేడ్లను ఏర్పాటు చేశారు.
  • ఇండియా గేట్​, రాజ్​పథ్​ ప్రాంతాలు భారత్​, అమెరికా జెండాలతో నిండిపోయాయి.
    flags
    భారత్​-అమెరికా జెండాలు
    flags
    భారత్​-అమెరికా జెండాలు

సబర్మతిలో...

అహ్మదాబాద్​లోని సబర్మతి ఆశ్రమానికి సోమవారం సతీసమేతంగా ట్రంప్​ వెళ్లనున్న నేపథ్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రతను కట్టుదిట్టం చేశారు.

Last Updated : Mar 2, 2020, 7:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.