ETV Bharat / bharat

దావూద్​ దోస్త్ 'టైగర్' అప్పగింతకు బ్రిటన్​ నో

1993 సూరత్​ బాంబు పేలుళ్లతో సంబంధం ఉన్న టైగర్​ హనీఫ్​ పటేల్​ను భారత్​కు అప్పగించడానికి బ్రిటన్​ నిరాకరించింది. హనీఫ్..​ అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీమ్​ అనుచరుడు. 2019లో అప్పటి బ్రిటన్​ హోంమంత్రి, పాకిస్థాన్​ సంతతి సాజిద్​ జావేద్ భారత్​ వినతిని కొట్టివేశారని అక్కడి ప్రభుత్వం ఆలస్యంగా వెల్లడించింది.

UK refuses to extradite Dawood aide and Gujarat blasts accused to India
దావూద్​ అనుచరుడు హనిఫ్​ అప్పగింతకు బ్రిటన్​ నిరాకరణ
author img

By

Published : May 18, 2020, 1:06 PM IST

అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీమ్​ అనుచరుడు టైగర్​ హనీఫ్​ను అప్పగించాలన్న భారత్​ వినతిని బ్రిటన్​ తోసిపుచ్చింది. ఈ విషయాన్ని బ్రిటన్​ హోంశాఖ కార్యాలయం స్పష్టం చేసింది.

హనీఫ్​ పూర్తి పేరు.. మహ్మద్​ హనీఫ్​ ఉమర్జీ పటేల్​. హనీఫ్​కు 1993 సూరత్​లో జరిగిన రెండు బాంబు పేలుళ్లతో సంబంధం ఉంది. అతడిని 2010 ఫిబ్రవరిలో మాం​చెస్టర్​లోని బాల్టన్​లో స్కాట్​ల్యాండ్​ యార్డ్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భారత అధికారులు తనను చిత్రహింసలు పెడతారని.. అందుకని బ్రిటన్​లోనే ఉండటానికి అనుమతులివ్వాలని బ్రిటన్​ కోర్టుకు అనేకమార్లు విన్నవించుకున్నాడు 57ఏళ్ల హనీఫ్​. కానీ అవన్నీ వీగిపోయాయి.

అయితే అతడు చివరి సారిగా చేసిన అభ్యర్థనపై అప్పటి హోం మంత్రి సాజిద్​ జావేద్​ సానుకూలంగా స్పందించారు. ఫలితంగా గతేడాది భారత్​ చేసిన విజ్ఞప్తిని పాకిస్థాన్​ సంతతి సాజిద్​ కొట్టివేశారు.

2012లోనే...

హనీఫ్​ను భారత్​కు అప్పగించే చర్యలు 2012లోనే మొదలయ్యాయి. అప్పటి హోం మంత్రి థెరెసా మే ఇందుకు ఆదేశాలు జారీ చేశారు. 2013 ఏప్రిల్​లో హనీఫ్​ అప్పగింతపై లండన్​ హైకోర్టులో విచారణ జరిగింది. 1992 బాబ్రీ ఘటన అనంతరం ఒక వర్గానికి చెందిన బృందం బాంబులు, తుపాకీలతో సూరత్​లో అలజడులు సృష్టించిందని న్యాయమూర్తికి తెలిపింది బ్రిటన్​ ప్రభుత్వం. అనంతరం హనీఫ్​ను భారత్​కు అప్పగించాలంటూ కోర్టు తీర్పునిచ్చింది.

అయితే భారత్​-యూకే అప్పగింత ఒప్పందం ప్రకారం.. ఓ వ్యక్తిని అప్పగించాలంటే తుది నిర్ణయం హోంమంత్రిదే. అందువల్ల 2019లో హనీఫ్​ అప్పగింత విన్నపాన్ని సాజిద్​ కొట్టివేశారు.

1993 జనవరిలో సూరత్​లోని ఓ మార్కెట్​ వద్ద జరిగిన బాంబు పేళుడులో ఓ ఎనిదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. అదే ఏడాది సూరత్​ రైల్వే స్టేషన్​ వద్ద జరిగిన పేలుడులో అనేకమంది గాయపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.