జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులతో పాటు వారి సానుభూతిపరుడు మృతి చెందాడు.
దక్షిణ కశ్మీర్ జిల్లా అవంతిపొరలోని గోరిపొరాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. జవాన్ల రాకను గుర్తించి, కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. అయితే, వారికి దీటుగా సమాధానమిచ్చింది భారత సైన్యం. ఇద్దరు ఉగ్రవాదులను, వారి సానుభూతిపరుడ్ని మట్టుబెట్టింది.
అవంతిపొర ప్రాంతంలో మరికొంత మంది తీవ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు అధికారులు.
ఇదీ చదవండి:కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం!