ETV Bharat / bharat

లాకప్​డెత్​ కేసులో ఐదుగురు పోలీసులు అరెస్టు

తమిళనాడు తండ్రీకొడుకుల లాకప్​డెత్​ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేశారు సీబీ- సీఐడీ అధికారులు. ఇందులో ముగ్గురు ఎస్సైలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తూత్తుకుడి సాతంకుళం ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేశారు.

Tuticorin custodial deaths:Sub Inspector Balakrishnan & constables Muthuraj & Murugan also arrested; 4 arrests so far
లాకప్​డెత్​: నలుగురు పోలీసులను అరెస్టు చేసిన సీబీ-సీఐడీ
author img

By

Published : Jul 2, 2020, 9:16 AM IST

తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల లాకప్​ డెత్​ కేసులో సీబీ- సీఐడీ అధికారులు పురోగతి సాధించారు. బుధవారం ఓ సబ్ ఇన్​స్పెక్టర్​ను అరెస్టు చేయగా.. ఇవాళ మరో నలుగురు అధికారులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ఎస్సైలు, మరో ఇద్దరు కానిస్టేబుల్స్​ ఉన్నారు.

సస్పెండ్​ అయిన సబ్​ ఇన్​స్పెక్టర్​ రాగు గణేశ్​ను అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న తూత్తుకుడి సాతంకుళం ప్రాంత ప్రజలు ఆనందంతో టపాసులను కాల్చారు.

పోలీసుల అరెస్టుతో టపాసులు కాలుస్తున్న ప్రజలు

ఏమిటీ ఈ కేసు?

లాక్​డౌన్ నిబంధనలను అతిక్రమించి.. వారి సెల్​ఫోన్ దుకాణాన్ని తెరిచినందుకు పి. జయరాజ్, ఫెనిక్స్​ను అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు. అనంతరం వారు కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దీంతో ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సీబీఐ ఛార్జి తీసుకునే వరకు సీబీ- సీఐడీతో విచారణ జరపాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది.

ఇదీ చూడండి:విద్యార్థులకు ఉచిత ల్యాప్​టాప్​లు ఇవ్వనున్న కేంద్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.