ETV Bharat / bharat

భలే ఐడియా​: పాత సీసాలతో టాయిలెట్లు

author img

By

Published : Nov 22, 2020, 2:03 PM IST

లాక్​డౌన్​ కాలంలో కొవిడ్​ రోగుల కోసం వాటర్​ బాటిళ్లను పంపిణీ చేశాయి స్వచ్ఛంద సంస్థలు. దీంతో వాడి పడేసిన బాటిళ్లు కుప్పలు తెప్పలుగా పోగయ్యాయి. అయితే అవి పర్యావరణానికి హాని కలిగించకుండా చూసేందుకు వినూత్నంగా ఆలోచించారు తమిళనాడులోని తూత్తుకుడి నగరపాలక సంస్థ అధికారులు. వారు చేసిన ప్రయత్నం పలువురి మన్ననలు పొందుతోంది.

Thoothukudi: Toilets built by using empty water bottles
ఐడియా అదుర్స్​- వాడి పడేసిన బాటిళ్లతో టాయిలెట్లు
భలే ఐడియా​: పాత సీసాలతో టాయిలెట్లు

తమిళనాడులోని తూత్తుకుడి నగరపాలక సంస్థ అధికారులు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొవిడ్​ కేంద్రాల నుంచి సేకరించిన, వాడి పడేసిన వాటర్​ బాటిళ్లతో శౌచాలయాలను నిర్మించి పలువురి మన్ననలు పొందుతున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ పథకం కింద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అధికారులు. ప్రయోగాత్మకంగా తూత్తుకుడి కార్పొరేషన్​ పరిధిలోని పెరుమాళ​పురం​లో ఈ నిర్మాణాలను చేపట్టారు.

Thoothukudi: Toilets built by using empty water bottles
సేకరించిన బాటిళ్లు

బాటిళ్లలో సముద్రపు ఇసుక నింపి..

సీసాలతో నిర్మిస్తున్న శౌచాలయం

సేకరించేటప్పుడే బాటిళ్లను పూర్తిగా శుభ్రపరిచారు. ఆ బాటిళ్లలో సముద్రపు ఇసుకను నింపి, ఇటుకలకు ప్రత్యామ్నాయంగా వినియోగించారు. ఇటుకలతో శౌచాలయాలు నిర్మించడానికి రూ.3 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తే.. ఈ బాటిళ్లతో నిర్మించడం వల్ల అందులో సగం ధరకే పూర్తవుతోందని చెబుతున్నారు అధికారులు. సమయం కూడా ఆదా అవుతుందని అంటున్నారు. త్వరలోనే మరిన్ని టాయిలెట్లను బాటిళ్లతో నిర్మిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:ఆమె రొట్టెలకు భలే గిరాకీ.. 200 మందికి ఉపాధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.