ETV Bharat / bharat

52 కిలోల భారీ పనస పండుకు గిన్నిస్​ రికార్డు!

author img

By

Published : May 18, 2020, 5:29 PM IST

Updated : May 19, 2020, 12:27 PM IST

పండ్లలో భారీ పండు ఏదయా అంటే.. టక్కున గుర్తొచ్చేది పనస పండే! అయితే, పనసకాయ ఓ పది నుంచి పదిహేను కిలోలుండడం మామూలే. కానీ, ఏకంగా నిలువెత్తు మనిషి బరువంత భారీ పనసను ఎప్పుడైనా చూశారా? అవునండీ.. కేరళలో 52 కిలోల పనస పండింది. అంతే, కాదు.. ఆ పండు ఇప్పుడు ప్రపంచ రికార్డు కొట్టేయబోతోంది.

'The biggest jackfruit'   Kollam jackfruit all set to enter Guinness world records
52 కిలోల భారీ పనస పండుకు గిన్నిస్​ రికార్డు!
52 కిలోల భారీ పనస పండుకు గిన్నిస్​ రికార్డు!

కేరళ వయ​నాడ్​లో ఓ పనస పండు ఇప్పుడు గిన్నిస్ రికార్డు కైవసం చేసుకోనుంది. అక్షరాలా 52 కిలోల 360 గ్రాముల బరువు, 117 సెంటిమీటర్ల పొడవు, 77సెంటీమీటర్ల చుట్టుకొలతతో ప్రపంచంలోనే భారీ పనసగా గుర్తింపు పొందనుంది.

మనంతవాడి సమీపంలోని కప్పటములలో పండిందీ పనస. గ్రామ పంచాయతీ సభ్యులు గిన్నిస్ అధికారులకు కబురెట్టారు. ఇందుకు కావలసిన పత్రాలను గిన్నిస్​ సంస్థకు పంపారు స్థానిక వ్యవసాయాధికారి. ఇక ఆ అధికారులు వచ్చి పరీక్షించి నిర్ధరించడమే ఆలస్యం.

రేసులో మరొకటి...

the-biggest-jackfruit-kollam-jackfruit-all-set-to-enter-guinness-world-records

అయితే, కేరళ కొల్లం జిల్లాలో 52 కిలోల పనసకు పోటీగా మరో పనస పండింది. ఇదాములక్కళ్​​ అంజళ్​కు చెందిన జానీకుట్టీ​ పెరట్లో పండిన ఈ వారిక్క రకం పనసపండు 51 కిలోల 500 గ్రామల బరువు, 97 సెంటిమీటర్ల పొడవు ఉంది. దీంతో లిమ్కా బుక్​ ఆఫ్ వరల్డ్​ రికార్డు, గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డు అధికారులకు సమాచారమిచ్చాడు జానీకుట్టి.

ఇప్పటివరకు పుణెలో పండిన 42.73 కిలోల బరువు, 57 సెంటిమీటర్ల పొడవుగల పనసే ప్రపంచంలోకెల్లా పెద్ద పనస. ఇప్పుడు ఆ రికార్డును బద్దలగొట్టేందుకు రెండు కేరళ పండ్లు సిద్ధమయ్యాయి.

ఇదీ చదవండి:బండికి తానే ఓ కాడెద్దైన వలస కార్మికుడు

Last Updated : May 19, 2020, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.