బిహార్ పట్నాలో భారీ వర్షపాతం నమోదైంది. వాన కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నంద కిషోర్ యాదవ్ ఇల్లు కూడా నీట మునిగింది.
![Streets waterlogged in Patna following heavy rainfall](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7805611_k.png)
బిహార్లోని పలు ప్రాంతాల్లో మరో 48 గంటల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సివాన్, గోపాల్‌గంజ్, సీతామార్హి, దర్భాంగా, సుపాల్, అరియారియా, కిషన్గంజ్,కటిహార్‌లో ఉరుములు, మెరుపులు, విపరీతమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ బ్యూరో తెలిపింది.
![Streets waterlogged in Patna following heavy rainfall](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7805611_kd.jpg)
వరదల్లో చిక్కుకున్న వారికి ఆర్థిక సాయం అందజేస్తామని నితిశ్ కుమార్ సర్కార్ ప్రకటించింది. జంతువులను కోల్పోయిన వారికి కూడా ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. వరదల కారణంగా ఏటా వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది జీవనోపాధిని లేక అవస్థలు పడుతున్నారు.
ఇదీ చూడండి:3నెలల తర్వాత తెరుచుకున్న సెలూన్ షాపులు