ETV Bharat / bharat

సైన్యంలోకి ఒకే కుటుంబం నుంచి 16 మంది

author img

By

Published : Jul 26, 2020, 10:44 AM IST

'నా బిడ్డ దేశం కోసం చనిపోయాడు.. నాకు చాలా గర్వంగా ఉంది' అని చెప్పే ఓ సైనికుడి తల్లిని చూసినప్పుడు ఒళ్లు పులకరిస్తుంది. ఆ అమ్మ దేశభక్తికి జేజేలు కొడతాం. కానీ, అదే సైన్యంలోకి మన ఇంట్లోంచి ఎవరినైనా పంపాలంటే..? చాలామంది తటపటాయిస్తారు. కానీ, కర్ణాటక చెందిన ఓ కుటుంబం మాత్రం ఆనందంగా 'సరే' అంటుంది. ఇప్పటికే 16 మందిని అలా పంపింది కూడా!

KARNATAKA SOLDIERS FAMILY
ఆ కుటుంబమే ఓ సైన్యం

కోదండెర మదప్ప కరియప్ప.. కేఎం కరియప్ప.. 1947 పాకిస్థాన్‌తో యుద్ధంలో భారత సేనలను నడిపించిన సేనాని. మన సైన్యానికి మొదటి భారతీయ కమాండర్‌- ఇన్‌-చీఫ్‌. సైన్యంలో అత్యంత అరుదైన 'ఫైవ్‌ స్టార్‌' ర్యాంకు 'ఫీల్డ్‌మార్షల్‌'ను అందుకున్న ఇద్దరే ఇద్దరిలో కరియప్ప ఒకరు ('ఫీల్డ్‌మార్షల్‌' శామ్‌ మానెక్‌షా మరొకరు). కరియప్ప వారసత్వాన్ని కర్ణాటక యువత సగర్వంగా అందిపుచ్చుకుంది.

దశాబ్దాలుగా వేల సంఖ్యలో కన్నడ యువకులు భారతీయ త్రివిధ దళాల్లో పనిచేశారు.. చేస్తున్నారు. అందుకే 'మార్చ్‌ ఆఫ్‌ ఏ ఫుట్‌ సోల్జర్‌' పుస్తక రచయిత, విశ్రాంత లెఫ్ట్‌నెంట్‌ కర్నల్‌ డీకే హవనూర్‌ 'సైన్యంలో ప్రత్యేకంగా కర్ణాటక రెజిమెంట్‌ను ఏర్పాటు చేయవచ్చు' అంటారు.

SPECIAL STORY ABOUT KARNATAKA SOLDIERS FAMILY
ఇంచల గ్రామం

16 మంది సైనికులు..

సైన్యంతో ఇంతగా బంధం పెనవేసుకుపోయిన ఈ రాష్ట్రంలోని బెళగావి జిల్లా ఇంచల గ్రామానికి చెందిన బాగెవాడి కుటుంబం ప్రత్యేకమైంది. 160 సభ్యులున్న ఈ ఉమ్మడి కుటుంబంలో 16 మందికి సైన్యంతో సుదీర్ఘ అనుబంధముంది. వీరిలో తొమ్మిది మంది పదవీ విరమణ చేశారు. మిగిలిన వారు వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. 1977లో బాగెవాడి కుటుంబానికి చెందిన రుద్రప్ప తొలిసారిగా సైన్యంలో చేరారు. అప్పటి నుంచి వారసులంతా ఆయన బాటలోనే నడిచారు.

బెళగావి

ఊళ్లకు ఊళ్లే..

ఉత్తర కర్ణాటక ప్రాంతం నుంచి సైనికులుగా వెళ్లేవారు ఎక్కువ మంది ఉంటారు. అందులోనూ బెళగావి జిల్లావారు అధికులు. ఓ పరిశీలన మేరకు బెళగావి వాసులు 50 వేల మంది దేశసేవలో శ్రమిస్తున్నారు.

సాధన చేస్తూ...

పదివేల మంది జనాభా ఉన్న ఇంచాలలో దాదాపు 600 మంది సైనికులు, ప్రభుత్వోద్యోగులున్నారు. దీనికో నేపథ్యముంది. ఇంచాల మఠాధిపతి డాక్టర్‌ శివానంద భారతి 1970లోనే ఓ పాఠశాలను నెలకొల్పారు. అక్కడ విద్యార్థులకు చదువుతో పాటు, దేశసేవనూ ప్రబోధించేవారు. అందుకే, ఇంచాలలోని ప్రతి కుటుంబంలోనూ ఓ సైనికుడో, ప్రభుత్వాధికారో ఉంటారు.

ఈ గ్రామంలో పదవీ విరమణ పొందిన 200 మంది సైనికులున్నారు. వీళ్లంతా కలిసి గ్రామ యువతకు సైనిక శిక్షణ ఇస్తున్నారు. అలాగే, గదగ్‌ జిల్లాలోని హటలగెరి కూడా సైన్యంతో చిరకాల అనుబంధమున్న గ్రామమే. 4 వేల జనాభా కలిగిన ఈ పల్లె నుంచి దాదాపు 150 మంది సైన్యంలో ఉన్నారు. ఇక్కడి ప్రతి వీధిలో ఒకటో రెండో కుటుంబాలు తమ బిడ్డలను దేశసేవకు అంకితం చేశాయి. మరి వీళ్లందరికీ సెల్యూట్‌ చేసేద్దాం.!

ఇదీ చదవండి: 'జవాన్ల శౌర్య, పరాక్రమాలతోనే కార్గిల్ విజయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.